రూ. 399కే ఎయిర్‌టెల్ 4జీ హాట్‌స్పాట్: నెలకు 50జీబీ డేటా

By rajashekhar garrepallyFirst Published May 9, 2019, 4:41 PM IST
Highlights

జియో రాకతో దేశీయ టెలికాం రంగంలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పుడు అన్ని సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. 
ఇప్పుడు ఈ సంస్థలకు చెందిన గాడ్జెట్ల మధ్య కూడా పోటీ నెలకొంది. 

జియో రాకతో దేశీయ టెలికాం రంగంలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పుడు అన్ని సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. 
ఇప్పుడు ఈ సంస్థలకు చెందిన గాడ్జెట్ల మధ్య కూడా పోటీ నెలకొంది. 

జియో డోంగిల్ ధరను కొంత కాలం క్రితం భారీగా తగ్గించి అమ్మకాలను పెంచుకున్న నేపథ్యంలో ఎయిర్‌టెల్ కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఎయిర్‌టెల్ 4జీ హాట్‌స్పాట్ ధరను భారీగా తగ్గించింది. అయితే, ఇది రెంటల్ బేసిక్ మాత్రమేనని కంపెనీ వెబ్‌సైట్‌లో వివరాలను గమనిస్తే తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఎయిర్‌టెల్ యూజర్లు రూ.999ని ఒకేసారి కొనుగోలు సమయంలో చెల్లించాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్లాన్ ప్రకారం ప్రతినెలా రూ. 399 చెల్లిస్తే సరిపోతుంది. ఇలా వైఫై హాట్ స్పాట్‌ని వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు 4జీ హాట్ స్పాట్ కొనుగోలు తర్వాత నెలకు 50జీబీ డేటా చొప్పున యూజర్లు పొందే అవకాశం ఉంది.

ఈ వైఫై డివైజ్‌ను స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి టాబ్లెట్లు, స్మార్ట్ టీవీల వరకు 10 డివైస్‌ల వరకు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ డివైజ్ పనిచేయడానికి ఎయిర్‌టెల్ సిమ్ కార్డు వేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్లలో సిమ్ కార్డులకు రీఛార్జ్ చేసినట్లే.. దీనికి కూడా రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది.

ఒక వేళ ఎయిర్‌టెల్ 4జీ నెట్‌వర్క్ అందుబాటులో లేకపోతే.. ఈ హాట్ స్పాట్ 3జీ నెట్ వర్క్‌లోకి మారిపోతుంది. ఈ డివైస్‌లో 1,500ఎంఏహెచ్ బ్యాటరీని పొందుపరిచారు. 6గంటలపాటు బ్యాటరీ ఛార్జ్ నిల్వ ఉంటుంది. ఎయిర్‌టెల్ 4జీ హాట్ స్పాట్‌లో ఉన్న స్పెషల్ ఫీచర్ ఏమంటే.. 4జీ నెట్ వర్క్ నుంచి ఆటోమేటిగ్గా 3జీకి కనెక్ట్ కావచ్చు. ఇది ఇలావుంటే, రిలయన్స్ జియో 2300ఎంఏహెచ్ బ్యాటరీని ఆఫర్ చేస్తుండటం గమనార్హం. 

click me!