జంషెడ్‌పూర్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో విజయాన్ని అందుకున్న గోవా ఎఫ్‌సీ...
చివరి నిమిషంలో గోల్ చేసిన గోవా ఎఫ్‌సీ ప్లేయర్ ఇగోర్ అంగ్లో..
ఇండియన్ సూపర్ లీగ్‌లో గోవా ఎఫ్‌సీ మూడో విజయాన్ని అందుకుంది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన తర్వాత గోవా ఎఫ్‌సీకి దక్కిన మొదటి విజయమిది. జంషెడ్‌పూర్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో విజయాన్ని అందుకుంది గోవా ఎఫ్‌సీ.
ఆట ప్రారంభమైన 33వ నిమిషంలో గోల్ చేసిన జంషెడ్‌పూర్ ప్లేయర్ స్టీఫెన్ ఇజే... ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత చాలాసేపు ఇరు జట్లు గోల్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఆట 64వ నిమిషంలో గోల్ చేసిన గోవా ఎఫ్‌సీ ప్లేయర్ ఇగోర్ అంగ్లో.. స్కోర్లను సమం చేశాడు.
ఆట చివరి నిమిషంలో మెరుపు వేగంతో మరో గోల్ చేసిన ఇగోర్ అంగ్లో... గోవాకి అద్భుత విజయాన్ని అందించాడు. మూడు విజయాలు అందుకున్న గోవా ఎఫ్‌సీ ఐదో స్థానంలో ఉండగా, జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ ఆరో స్థానంలో కొనసాగుతోంది.