బెంగళూరు ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో విజయాన్ని అందుకున్న ఏటీకే మోహన్ బగాన్...
ఏకైక గోల్ చేసిన డేవిడ్ విలయమ్స్...
పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఏటీకే మోహన్ బగాన్, మూడో స్థానంలో బెంగళూరు...
ఇండియన్ సూపర్ లీగ్ 2020లో ఏటీకే మోహన్ బగాన్ గెలుపు జోరు కొనసాగుతూనే ఉంది. ముంబై సిటీ టాప్ ప్లేస్‌లో ఉండగా ఏటీకే మోహన్ బగాన్ రెండో స్థానంలో కొనసాగుతోంది. సోమవారం బెంగళూరు ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో విజయాన్ని అందుకుంది ఏటీకే మోహన్ బగాన్.
ఆట 33వ నిమిషంలో గోల్ చేసిన ఏటీకే మోహన్ బగాన్ ప్లేయర్ డేవిడ్ విలియమ్స్... జట్టుకి ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత ఇరు జట్లు గోల్ చేసేందుకు విశ్వ ప్రయత్నం చేసినా ప్రత్యర్థి ఆటగాళ్ల నుంచి ప్రతిఘటన ఎదురైంది.
మూడు మ్యాచుల్లో గెలిచి, మూడు మ్యాచులు డ్రా చేసుకున్న బెంగళూరు ఎఫ్‌సీకి ఈ సీజన్‌లో ఇది తొలి ఓటమి. బెంగళూరు ఎఫ్‌సీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.