ISL 2021: నార్త్ ఈస్ట్ యునైటెడ్ అద్భుత విజయం... జంషెడ్‌పూర్‌కి మరో ఓటమి...

By team telugu  |  First Published Jan 18, 2021, 10:06 AM IST

జంషెడ్‌పూర్‌పై 2-1 తేడాతో విజయం అందుకున్న నార్త్ ఈస్ట్ యునైటెడ్...

పాయింట్ల పట్టికలో ఐదోస్థానానికి ఎగబాకిన నార్త్ ఈస్ట్ యునైటెడ్...


ఇండియన్ సూపర్ లీగ్‌ 2020-21 సీజన్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ మరో విజయాన్ని అందుకుంది. జంషెడ్‌పూర్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో గెలిచి సీజన్‌లో మూడో విజయాన్ని అందుకుంది నార్త్ ఈస్ట్ యునైటెడ్.

ఆట ప్రారంభమైన 36వ నిమిషంలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ప్లేయర్ అశుతోష్ మెహతా గోల్ చేసి... జట్టుకి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 61వ నిమిషంలో బ్రౌన్ గోల్ చేయడంతో ఆధిక్యం 2-0తేడాతో మరింత పెరిగింది. 

Latest Videos

ఆట 89వ నిమిషంలో గోల్ చేసిన జంషెడ్‌పూర్ ప్లేయర్ పీటర్ హీర్టీ... ఆధిక్యాన్ని 2-1 తేడాకి తగ్గించాడు. ఈ విజయంతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ పాయింట్ల పట్టికలో ఐదోస్థానానికి ఎగబాకగా... జంషెడ్‌పూర్ 8వ స్థానంలో ఉంది.

click me!