ISL 2021: హైదరాబాద్ సూపర్ డ్రా... ముంబై సిటీ వరుస విజయాలకు బ్రేక్...

Published : Jan 17, 2021, 09:40 AM IST
ISL 2021: హైదరాబాద్ సూపర్ డ్రా... ముంబై సిటీ వరుస విజయాలకు బ్రేక్...

సారాంశం

పూర్తి సమయంలో ఒక్క గోల్ కూడా చేయలేకపోయిన ఇరు జట్ల ప్లేయర్లు... హైదరాబాద్ ఎఫ్‌సీ, ముంబై సిటీ మధ్య మ్యాచ్ డ్రా... టేబుల్ టాపర్‌గా కొనసాగుతున్న ముంబై... నాలుగో స్థానంలో హైదరాబాద్...

ఇండియన్ సూపర్ లీగ్ 2020-21 సీజన్‌లో వరుసగా నాలుగు విజయాలు సాధించి, టేబుల్ టాపర్‌గా కొనసాగుతున్న ముంబై సిటీకి హైదరాబాద్ బ్రేక్ ఇచ్చింది. ముంబై సిటీతో జరిగిన మ్యాచ్‌ను డ్రాగా ముగించింది హైదరాబాద్ ఎఫ్‌సీ. పూర్తి సమయంలో ఇరు జట్ల ప్లేయర్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు.

మొదటి నుంచి డిఫెన్సివ్ ఆటతో ఆకట్టుకున్న హైదరాబాద్ ఎఫ్‌సీ, ముంబైకి ఎలాంటి అవసరం ఇవ్వలేదు. గోల్ చేసే అవకాశం వచ్చినా హైదరాబాద్ గోల్ కీపర్ లక్ష్మీకాంత్, ముంబైకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ముంబై సిటీ ఎఫ్‌సీ 8 విజయాలతో టాప్‌లో ఉండగా, హైదరాబాద్ 4 విజయాలు, 4 డ్రాలతో నాలుగో ప్లేస్‌లోకి దూసుకొచ్చింది. ఏటీకే మోహన్ బగాన్ రెండో స్థానంలో, గోవా ఎఫ్‌సీ మూడో స్థానంలో ఉన్నాయి..

PREV
click me!

Recommended Stories

భారత్‌కు వస్తున్న మెస్సీ.. మోడీతో భేటీ
Premier League: రికార్డు స్థాయిలో ప్రీమియర్ లీగ్ ఆదాయం.. కానీ