Turkey Earthquake: ఇటీవల టర్కీ, సిరియాలలో వచ్చిన భూకంపానికి సుమారు 43 వేల మంది మరణించి ఉంటారని అంచనా. ఇందులో ఓ అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్లేయర్ కూడా ఉన్నాడు.
రెండు వారాల క్రితం టర్కీ, సిరియాను అతలాకుతలం చేసిన భూకంపం నుంచి ఈ రెండు దేశాలూ ఇంకా కోలుకోలేదు. భూమి నిట్టనిలువుగా చీలడంతో ఇప్పటికీ ఈ రెండు దేశాల్లోని చాలా ప్రాంతాల్లో జనజీవనం సాధారణ స్థితికి రాలేదు. శిథిలాల కింద శవాల కుప్పలుతెప్పలుగా తేలుతూనే ఉన్నాయి. తాజాగా టర్కీలోని శిథిలాల్లో ఘనాకు చెందిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్లేయర్, మాజీ చలీసా ఫ్రాంచైజీ ఆటగాడు క్రిస్టియాన్ అట్సు బాడీ లభ్యమైంది. ఈ విషయాన్ని ఆయన మేనేజర్ కన్ఫర్మ్ చేశాడు.
ఫిబ్రవరి 6న వచ్చిన భూకంపానికి టర్కీ లోని చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి. రిక్టార్ స్కేలుపై 7.8 తీవ్రతతో వచ్చిన ఈ ప్రకృతి ప్రకోపానికి సుమారు 43 వేల మంది మరణించారని ఐరాస అంచనా వేస్తున్నది. ఇక హటాయ్ లోని అంటక్యా సిటీలో అట్సు మృతదేహం లభ్యమైంది. ఫిబ్రవరి 5న ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన అట్సు.. వాస్తవానికి అదే రోజు రాత్రి మరో చోటుకు వెళ్లాల్సి ఉన్నా అక్కడే ఆగిపోవడంతో అతడు భూకంప బాధితుడిగా మిగిలాడు.
అట్సు గతంలో యూరోపియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రముఖ ఫ్రాంచైజీ చలీసా తరఫున నాలుగు సీజన్ల పాటు ఆడాడు. గత సెప్టెంబర్ లోనే అతడు టర్కిష్ సూపర్ లీగ్ లో భాగంగా హటయస్పర్ కు మారాడు. ఫిబ్రవరి 5న రాత్రి అతడు దక్షిణ టర్కీకి వెళ్లాలని షెడ్యూల్ ఉన్నా అదే రోజు తన ఫ్రాంచైజీ మ్యాచ్ లో గెలవడంతో రాత్రికి అక్కడే ఉండిపోయాడు. ఈ మ్యాచ్ గెలవడంలో అట్సుదే ప్రధాన పాత్ర. అదే అతడికి శాపంగా మారింది.
Absolutely tragic, heartbreaking news to wake up to this morning. Thoughts and condolences with Christian’s family and friends. Rest in Peace Christian Atsu pic.twitter.com/5hzvIbdUll
— Newcastle Fans TV (@NewcastleFansTV)టర్కీ భూకంపంలో అట్సు మిస్ అయ్యాడని వార్తలు వచ్చాయి. అతడి ఫోన్ మిస్ కావడం, ఆచూకీ తెలియకపోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక ఫుట్‌బాల్ ప్రపంచం నివ్వెరపోయింది. దీనిపై అతడి కుటుంబం నుంచి గానీ ఫ్రాంచైజీ నుంచి గానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ రెండు వారాల తర్వాత అట్సు మృతదేహాన్ని అంటక్యాలోని శిథిలాల క్రింద స్వాధీనం చేసుకున్నట్టు స్థానిక అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని అట్సు మేనేజర్ మురత్ ఉజున్మెహ్మట్ కూడా తన ట్విటర్ ఖాతాలో ఖాయం చేశాడు. అట్సు మృతదేహంతో పాటు అతడి ఫోన్ కూడా లభ్యమైంది. అట్సు మృతదేహం లభ్యం కావడంతో ఫుట్‌బాల్ ప్రపంచం నివ్వెరపోయింది. ఫిఫా అతడికి నివాళి అర్పించింది. అట్సు ఆత్మకు శాంతి కలగాలని అతడి సహచర ఆటగాళ్లతో పాటు ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
🇬🇭💔
Rest in peace, Christian. pic.twitter.com/CdEriCc81h
Christian Atsu's agent has confirmed 'Atsu has been found dead'. Rest in Peace Atsu 💔
Via pic.twitter.com/aWKgdUYAsR