FIFA World Cup 2022: అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ తన ప్రపంచకప్ కలను నిజం చేసుకున్న తర్వాత సోషల్ మీడియా హోరెత్తింది. మెస్సీ మ్యాజిక్ కు ప్రపంచమే ఫిదా అయింది.
ఖతర్ లో ముగిసిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ లో ఫ్రాన్స్ ను పెనాల్టి షూట్ అవుట్ 4-2 (3-3) తో ఓడించింది అర్జెంటీనా. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత జగజ్జేతగా నిలిచిన అర్జెంటీనా జట్టు కంటే ఆ టీమ్ కెప్టెన్, ఆధునిక సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ గురించే చర్చ అంతా. ఫుట్‌బాల్ మీద అవగాహన లేనివాళ్లు కూడా ‘మెస్సీ సాధించాడు’ అని పొంగిపోయారు. అయితే వరల్డ్ కప్ గెలిచి ట్రోఫీ అందుకున్న తర్వాత మెస్సీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన పోస్టు ఇప్పుడు నెట్టింట పెను సంచలనంగా మారింది. మెస్సీ పోస్టుకు లైకుల కుంభమేళా సాగుతోంది..
ఫైనల్ అనంతరం మెస్సీ.. మ్యాచ్ తో పాటు ప్రపంచకప్ ను సగర్వంగా ఎత్తుకుని ముద్దాడటం, సహచర ఆటగాళ్లతో కలిసి ఆనంద క్షణాలను పంచుకోవడం, అభిమానులకు అభివాదం చేస్తున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. ఈ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో పెనుదుమారాన్ని రేపుతున్నాయి.
undefined
మెస్సీ పెట్టిన ఈ పోస్టుకు ఇప్పటికే 5 కోట్ల 48 లక్షలకు పైగా నెటిజనులు లైకులు కొట్టారు. లక్షల్లో కామెంట్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ చరిత్రలో ఇదొక రికార్డు. గతంలో ఒక సెలబ్రిటీ పెట్టిన పోస్టుకు ఇన్ని లైకులు వచ్చిన దాఖలాల్లేవు. ఈ ప్రపంచకప్ కు ముందు మెస్సీ, రొనాల్డోలు కలిసి చెస్ ఆడుతున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
ఈ పోస్టుకు 4 కోట్ల 20 లక్షల లైకులు వచ్చాయి. ఇప్పటివరకూ ఇదే రికార్డు. కానీ మెస్సీ ఆ రికార్డును ఎప్పుడో దాటేశాడు. ఇప్పటికే సుమారు 5.5 కోట్లు దాటిన లైకుల సంఖ్య 6 కోట్లకు చేరడం పెద్ద విషయమేమీ కాదు.
మెస్సీ, రొనాల్డోల మధ్య గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) ఎవరా..? అని చర్చ జరుగుతున్న నేపథ్యంలో మెజారిటీ ప్రజలు మెస్సీకే ఓటేస్తున్న తరుణంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కూడా అందుకు అనుగుణంగానే రొనాల్డో రికార్డును బ్రేక్ చేసి దూసుకెళ్లుతుండటం గమనార్హం. తమ కెరీర్ లో చివరి ప్రపంచకప్ (?) ఆడిన ఈ ఇద్దరిలో రొనాల్డో పోర్చుగల్ తరఫున ఒకటే గోల్ కొట్టాడు. కానీ మెస్సీ మాత్రం ఏడు గోల్స్ కొట్టి గోల్డెన్ బాల్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
With 47M likes AND COUNTING, Leo Messi sets a record on Instagram as his victory post has become the most liked post by an athlete 😳🏆 pic.twitter.com/mTv8AWvZiR
— 𝐓𝐡𝐞 𝐒𝐩𝐨𝐫𝐭𝐢𝐧𝐠 𝐍𝐞𝐰𝐬 (@sportingnews)