ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీకి కరోనా.. అప్పుడే కొవిడ్‌పై పోస్టు.. ఇంతలోనే పాజిటివ్

By Mahesh KFirst Published Jan 2, 2022, 6:48 PM IST
Highlights

స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉన్నారు. ఫ్రెంచ్ కప్‌లో భాగంగా సోమవారం రాత్రి ఆయన పీఎస్‌జీ తరఫున క్లబ్ మ్యాచ్ ఆడాల్సి ఉన్నది. కానీ, ఇంతలోనే ఆయనకు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ఆయనతోపాటు మరో ముగ్గురు ఆటగాళ్లకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.

న్యూఢిల్లీ: అర్జెంటినా(Argentina) ఫుట్‌బాల్(Football) స్టార్ లియోనల్ మెస్సీ(Lionel Messi) కరోనా(Coronavirus) బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన స్వీయ ఐసొలేషన్‌లో ఉన్నారు. ప్యారిస్ సెయింట్ జెర్మన్(పీఎస్‌జీ) ఆదివారం ఈ ప్రకటన చేసింది. సోమవారం సాయంత్రం ఆయన ఫ్రెంచ్ కప్‌లో పీఎస్‌జీ తరఫున ఆడాల్సి ఉన్నది. కానీ, ఇంతలోనే కరోనా పాజిటివ్ రావడంతో సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి వెళ్లారు. గత వేసవిలో బార్సిలోనా నుంచి వైదొలిగి ఫుట్‌బాల్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన మెస్సీ.. పీఎస్‌జీలో రాణించడానికి తంటాలు పడ్డాడు. డొమెస్టిక్ లీగ్‌లో ఆయన కేవలం ఒకే ఒక్క గోల్ చేయగలిగాడు. కానీ, చాంపియన్ లీగ్‌లో యూరప్ ఐదు గోల్స్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మెస్సీతోపాటు మరో ముగ్గురు సహ ఆటగాళ్లకూ కరోనా సోకినట్టు పీఎస్‌జీ వెల్లడించింది.

పీఎస్‌జీ(PSG) విడుదల చేసిన జనవరి 2వ తేదీ మెడికల్ అప్‌డేట్ ప్రకారం, లియోనల్ మెస్సీతోపాటు జువాన్ బెర్నాట్, సెర్జియో రికో, నాథన్ బితుమజాలాకూ కరోనా రిపోర్టు పాజిటివ్‌గా వచ్చినట్టు వెల్లడించింది. నెయ్‌మర్‌ జూనియర్ కరోనా టెస్టు రిపోర్ట్ నెగెటివ్‌గా వచ్చినట్టు వివరించింది. ప్రస్తుతం నెయ్‌మర్ జూనియర్ బ్రెజిల్‌లో ఉన్నాడు. మరో మూడు వారాల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. నూతన సంవత్సర వేడుకలను కుటుంబం, సన్నిహితులతో జరుపుకోవడానికి లియోనల్ మెస్సీ ఇటీవలే అర్జెంటీనాకు వెళ్లాడు. వారితోనే గడిపాడు. ఆయన తన న్యూ ఇయర్ మెస్సేజీలోనూ కరోనా వైరస్, ప్రపంచంపై దాని ప్రభావం గురించిన పోస్టు ఒకటి పెట్టాడు. కొవిడ్-19పై ఆయన పోస్టు పెట్టాడో లేదో.. ఇంతలోనే ఆయనకు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది.

Also Read: మెస్సీ వాడి, పాడేసిన టిష్యూ అమ్మాకానికి పెట్టేశాడు... ధర ఎంతో తెలిస్తే...

2021లో తాను జీవించడానికి సహకరించిన ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పారు. ఎప్పటికీ అంతం కాని ఈ వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది తీవ్రంగా బాధపడ్డారని వివరించారు. అయితే, 2022 సంవత్సరం ఆరోగ్యాన్ని కుప్పలుగా తెచ్చిపెడుతుందని, ఈ నూతన సంవత్సరంలో అందరి కోసం తాను కోరుకునేది ఇదేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ నా హగ్ అని ఆశాజనక సందేశాన్ని పోస్టు చేశారు. యూరప్‌లో ఒమిక్రాన్ కారణంగా కరోనా కేసులు విస్ఫోటనంలా నమోదవుతున్నాయి. 

Also Read: కన్నీళ్లతో బార్సీలోనాకి వీడ్కోలు తెలిపిన మెస్సీ... కాంట్రాక్ట్ సగం తగ్గించుకుంటానని చెప్పినా...

అర్జెంటీనా (Argentina) ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ (Lionel Messi) అరుదైన ఘనత సాధించాడు. ఫుట్‌బాల్ (FootBall) లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేవారికి ఇచ్చే ప్రతిష్టాత్మక బాలెన్ డీ ఓర్ (Ballon D'or) అవార్డును అతడు ఏడోసారి సొంతం చేసుకున్నాడు. ఇంతకుముందు మెస్సీ ఈ  అవార్డును 2009, 2010, 2011, 2012లలో వరుసగా నాలుగు సార్లు గెలుపొందగా ఆ తర్వాత 2015, 2019లో కూడా దక్కించుకున్నాడు. ఇటీవలే ఆయన గెలుచుకున్నది ఏడోసారి కావడం గమనార్హం. పారిస్ (paris) వేదికగా జరిగిన అవార్డు కార్యక్రమంలో సుమారు 30 మందిని దాటుకుని మరీ మెస్సీ.. బాలెన్ డీ ఓర్ ను ఏడోసారి ముద్దాడాడు. సుదీర్ఘకాలంగా బార్సిలోనా తరఫున ఆడిన మెస్సీ.. ఈ ఏడాది ఆగస్టులో ఆ జట్టుతో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫ్రాన్స్ లోని పారిస్ సెయింట్ జర్మెయిన్ (పీఎస్జీ) తో మెస్సీ జట్టు కట్టాడు.

click me!