FIFA Knockout Rules : ఒక్క కార్డుతో వరల్డ్ కప్ నుంచే అవుట్.. ఫిఫా రూల్స్ తెలిస్తే మైండ్ బ్లాకే !

Published : Jun 21, 2026, 03:07 PM IST
FIFA Knockout Rules How Yellow and Red Cards Decide Team Destiny

సారాంశం

FIFA Knockout Rules : ఫిఫా వరల్డ్ కప్‌లో పాయింట్లు సమానమైతే నాకౌట్ చేరేందుకు ఫేర్ ప్లే పాయింట్లు కీలకం అవుతాయి. ఎల్లో, రెడ్ కార్డులు జట్లను ఎలా ప్రభావితం చేస్తాయి? ఫిఫా నాకౌట్ రూల్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

FIFA Knockout Rules : ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేటప్పుడు ప్లేయర్లు ఫౌల్ చేస్తే అంపైర్ ఎల్లో కార్డ్ లేదా రెడ్ కార్డ్ ఇవ్వడం మనం చూస్తుంటాం. అయితే, ఈ కార్డులు కేవలం ఆ మ్యాచ్‌కే పరిమితం కావు. మీ ఫేవరెట్ టీమ్ నాకౌట్ కు చేరుతుందా లేదా అనేది కూడా ఈ కార్డులే డిసైడ్ చేస్తాయి. అవును, ఫిఫా (FIFA) నియమాలు చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. గ్రూప్ స్టేజ్‌లో జట్ల మధ్య పాయింట్లు సమానంగా వచ్చినప్పుడు, తదుపరి రౌండ్‌కు ఎవరు వెళ్లాలో తేల్చడానికి ఈ కార్డుల పాయింట్లను లెక్కిస్తారు.

ఫిఫా రూల్స్ ఇవే

ఫిఫా కొత్త ఫార్మాట్ ప్రకారం మొత్తం 12 గ్రూపులు ఉంటాయి. ఇందులో 48 టీమ్స్ పోటీ పడతాయి. వీటిలో మొదటి నోకౌట్ రౌండ్‌కు 32 టీమ్‌లు మాత్రమే క్వాలిఫై అవుతాయి. ప్రతి గ్రూప్‌లో టాప్-2 స్థానాల్లో నిలిచిన 24 జట్లు నేరుగా తదుపరి రౌండ్‌కు చేరుకుంటాయి. ఇక మిగిలిన 8 స్థానాల కోసం గట్టి పోటీ ఉంటుంది. అన్ని గ్రూపుల్లో మూడో స్థానంలో నిలిచిన జట్లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన టాప్-8 టీమ్స్‌కు ఈ అవకాశం దక్కుతుంది.

కార్డులు పడితే పాయింట్లు మైనస్

ఒకవేళ మూడో స్థానంలో ఉన్న జట్ల పాయింట్లు సమానంగా ఉంటే, మొదట గోల్స్ డిఫరెన్స్ చూస్తారు. అక్కడ కూడా టై అయితే, ఎక్కువ గోల్స్ చేసిన టీమ్‌ను ముందుకు పంపుతారు. ఒకవేళ అప్పుడు కూడా విజేత తేలకపోతే, ఫేర్ ప్లే పాయింట్లు లెక్కిస్తారు. ఇక్కడే ప్లేయర్లు, టీమ్ అఫీషియల్స్‌కు వచ్చే కార్డులు విలన్లుగా మారుతాయి.

• ఒక ఎల్లో కార్డ్ వస్తే -1 పాయింట్.

• రెండో ఎల్లో కార్డ్ వచ్చి గ్రౌండ్ బయటకు వెళ్తే అంటే ఇండైరెక్ట్ రెడ్ కార్డ్ -3 పాయింట్లు.

• డైరెక్ట్ రెడ్ కార్డ్ వస్తే -4 పాయింట్లు.

• ఒకే మ్యాచ్‌లో ఎల్లో కార్డ్, డైరెక్ట్ రెడ్ కార్డ్ రెండూ వస్తే ఏకంగా -5 పాయింట్లు కట్ చేస్తారు.

ఈ లెక్కలన్నీ చూశాక కూడా టై అయితే, అప్పుడు ఫిఫా లాస్ట్ టైమ్ రిలీజ్ చేసిన అఫీషియల్ ర్యాంకింగ్స్ ఆధారంగా క్వాలిఫైయింగ్ టీమ్‌ను డిసైడ్ చేస్తారు.

మూడో స్థానం నుండి ఫైనల్ వరకు

చరిత్రను ఒకసారి తిరగేస్తే, గ్రూప్ స్టేజ్‌లో మూడో స్థానంలో నిలిచి ఆ తర్వాత టోర్నమెంట్‌ను ఊపేసిన టీమ్‌లు చాలానే ఉన్నాయి. 1990 ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనా జట్టు గ్రూప్-బిలో కెమరూన్, రొమేనియా కంటే వెనుకబడి మూడో స్థానంలో నిలిచింది. కానీ బెస్ట్ థర్డ్ ప్లేస్ టీమ్‌గా నాకౌట్‌కు వచ్చి.. ప్రిక్వార్టర్స్‌లో బ్రెజిల్‌ను, క్వార్టర్స్‌లో యుగోస్లేవియాను, సెమీస్‌లో ఇటలీని ఓడించి ఫైనల్ చేరింది. అయితే ఫైనల్లో జర్మనీ చేతిలో ఓడిపోయింది. అలాగే 1994లో ఇటలీ కూడా గ్రూప్ స్టేజ్‌లో మూడో స్థానంలో ఉండి, ఫైనల్ వరకు దూసుకెళ్లి బ్రెజిల్ చేతిలో ఓడింది. అదే వరల్డ్ కప్‌లో స్వీడన్, బల్గేరియా కూడా మూడో స్థానం నుండి వచ్చి సెమీఫైనల్స్ ఆడి చరిత్ర సృష్టించాయి.

రొనాల్డో టీమ్ కూడా అంతే

ఇక 2016 యూరో కప్‌లో క్రిస్టియానో రొనాల్డోకు చెందిన పోర్చుగల్ జట్టు గ్రూప్ స్టేజ్‌లో హంగేరి, ఐస్‌లాండ్ కంటే వెనుకబడి మూడో స్థానంలో నిలిచింది. కానీ ఆ తర్వాత పుంజుకుని, అదే ఏడాది ఏకంగా కప్పు కొట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. అందుకే ఫుట్‌బాల్ ప్రపంచంలో గ్రూప్ స్టేజ్‌లో మూడో స్థానంలో వచ్చే జట్లను అస్సలు తక్కువ అంచనా వేయలేం. వారు ఎప్పుడైనా గేమ్ ఛేంజర్స్ కావచ్చు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pakistan Flag on Boots : బూట్లపై పాకిస్తాన్ జెండా.. ఏవరీ ఫీఫా ప్రపంచ కప్ ప్లేయర్? సోషల్ మీడియాలో రచ్చ !
FIFA World Cup 2026: లియోనెల్ మెస్సీ మైండ్ బ్లోయింగ్ రికార్డ్.. ఫస్ట్ టైమ్ వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ గోల్స్ !