‘‘యూఏఈకి జై కొట్టండి’’... భారత అభిమానులను బంధించిన దుబాయ్ షేక్

By sivanagaprasad kodati  |  First Published Jan 12, 2019, 1:50 PM IST

ఏదైనా ఆట జరుగుతున్నప్పుడు ఆయా జట్లకు సంబంధించిన అభిమానులు తమ జట్టే విజయం సాధించాలని కోరుకోవడం సహజం. కానీ ప్రత్యర్థి జట్టుకు చెందిన అభిమానులు తమ జట్టే గెలుపొందాలని జై కొట్టడాన్ని సహించలేకపోయిన ఓ వ్యక్తి సదరు అభిమానులను హింసించాడు. 


ఏదైనా ఆట జరుగుతున్నప్పుడు ఆయా జట్లకు సంబంధించిన అభిమానులు తమ జట్టే విజయం సాధించాలని కోరుకోవడం సహజం. కానీ ప్రత్యర్థి జట్టుకు చెందిన అభిమానులు తమ జట్టే గెలుపొందాలని జై కొట్టడాన్ని సహించలేకపోయిన ఓ వ్యక్తి సదరు అభిమానులను హింసించాడు.

వివరాల్లోకి వెళితే.. యూఏఈ వేదికగా జరుగుతున్న ఏషియన్ ఫుట్‌బాల్ కప్‌లో భాగంగా గురువారం రాత్రి యూఏఈ-భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. దీనిని తిలకించేందు విచ్చేసిన భారత అభిమానులను ఓ యూఏఈ షేక్ అడ్డుకున్నాడు. ‘‘మీరు ఏ జట్టు గెలవాలని కోరుకుంటారు’’ అని ప్రశ్నించగా.. ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ గెలవాలని కోరుకుంటామని అందరూ ముక్తకంఠంతో చెప్పారు.

Latest Videos

undefined

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ వ్యక్తి....మీరంతా యూఏఈ జట్టుకే మద్ధతు పలకాలని బెత్తం తీసుకుని బెదిరించాడు, అంతేకాకుండా వీరందరనీ పక్షులను బంధించే పంజరంలో బంధించాడు. దీంతో వారంతా తప్పనిసరి పరిస్థితుల్లో యూఏఈకి మద్ధతు పలకడకంతో వారిని విడుదల చేశాడు.

షేక్ అత్యుత్సాహాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టదంతో యూఏఈ అటార్నీ జనరల్ స్పందించారు. తోటి జట్టు అభిమానుల పట్ల వివక్షాపూరితంగా వ్యవహరించి, బెదిరింపులకు పాల్పడినందుకు గాను సదరు షేక్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.

ఈ విషయం షేక్ దాకా వెళ్లడంతో ఆయన మాట మార్చాడు ‘‘ వీడియోలో చేసినదంతా సరదా కోసమేనని, వీరంతా తన దగ్గర పనిచేసేవారేనని చెప్పారడు. గత 20 ఏళ్లుగా వీళ్లు నాకు బాగా తెలుసునన్నారు. మేమంతా కలిసిమెలిసి ఉంటామని, ఒకే కంచంలో కలిసి భోజనం చేస్తామన్నారు. నేను వారిని నిజంగా కొట్టలేదు, బంధించలేదంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.

click me!