ఫుట్‌బల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి విషమం... శస్త్రచికిత్స తర్వాత ఐసీయూలో...

By Chinthakindhi Ramu  |  First Published Sep 12, 2021, 11:55 AM IST

మాజీ దిగ్గజ ఫుట్‌బాలర్ పీలే పెద్ద పెగులో కణతి... శస్త్ర చికిత్స ద్వారా తొలగించింన వైద్యులు...


బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే అనారోగ్యానికి గురయ్యారు. కొన్నాళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న పీలేకి అన్ని పరీక్షలు చేసిన వైద్యులు, ఆయన పెద్ద ప్రేగులో కణితి పెరుగుతున్నట్టు గుర్తించారు... వెంటనే శస్త్రచికిత్స చేసి ఆ కణితిని తొలగించిన వైద్యులు, ప్రస్తుతం ఐసీయూలో ఉంచి ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.

శస్త్రచికిత్స తర్వాత పీలే ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటారని తెలిపారు ఆసుపత్రి వైద్యులు. బ్రెజిల్‌కి చెందిన పీలే, మూడు వరల్డ్‌కప్ విజయాలు సాధించి ఫుట్‌బాల్ లెజెండ్‌గా అవతరించాడు.

Latest Videos

తన కెరీర్‌లో 92 మ్యాచులు ఆడిన పీలే, 77 అంతర్జాతీయ గోల్స్ సాధించి.. అత్యధిక గోల్స్ సాధించిన ఫుట్‌బాల్ ప్లేయర్లలో ఒకడిగా రికార్డు క్రియేట్ చేశాడు...

1967లో నైజీరియాలో సివిల్ వార్ జరిగింది. అయితే పీలే ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు ఆ యుద్ధాన్ని కూడా 48 గంటలపాటు నిలిపివేశారు అక్కడి ప్రజలు. పీలేకి అప్పట్లో ఉన్న క్రేజ్‌కి ఇదో ఉదాహరణ మాత్రమే...

click me!