‘ముగ్గురు భార్యలున్నా... చాలా మందితో సెక్స్ చేశా..’

By telugu news team  |  First Published Feb 24, 2021, 10:32 AM IST

బ్రిటీష్ టాబ్లాయిడ్, ది సన్ ప్రకారం, పీలే కొత్త నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో  తన ఎఫైర్స్ గురించి నోరు విప్పాడు. తనకు చాలా మంది సెక్సువల్ ఎఫైర్స్ ఉన్నాయని నిజాయితీగా అంగీకరించాడు.


తనకు ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ.. లెక్కలేనంత మందితో తనకు ఎఫైర్స్ ఉన్నాయని.. చాలా మందితో తాను సెక్స్ చేశానంటూ
బ్రెజిల్ ఫుట్‌బాల్ లెజెండ్, మూడుసార్లు ప్రపంచ కప్ విజేత పీలే షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన వల్ల చాలా మందికి పిల్లలు పుట్టారని.. వాళ్లు ఎవరో... ఎక్కడున్నారో కూడా తనకు తెలీదని ఆయన చెప్పడం గమనార్హం. 

బ్రిటీష్ టాబ్లాయిడ్, ది సన్ ప్రకారం, పీలే కొత్త నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో  తన ఎఫైర్స్ గురించి నోరు విప్పాడు. తనకు చాలా మంది సెక్సువల్ ఎఫైర్స్ ఉన్నాయని నిజాయితీగా అంగీకరించాడు. వాళ్లల్లో కొందరికి పిల్లలు కూడా ఉన్నారని.. కానీ వాళ్లు ఎవరో కూడా తనకు తెలీదన్నాడు. ఈ మధ్యే కొన్ని విషయాలు తనకు తెలిశాయని ఆయన చెప్పడం గమనార్హం.

Latest Videos

undefined

ప్రపంచానికి మాత్రం పీలే కి కుమార్తె సాండ్రా మచాడాతో సహా.. ఏడుగురు కుమారులు ఉన్నారు. అయితే.. సాండ్రా మచాడా ని తన కుమార్తెగా పీలే అంగీకరించకపోవడం గమనార్హం. 1996లో ఆమె అతని కుమార్తేనని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఆయన అంగీకరించలేదట. ఈ విషయాన్ని కూడా ఆయనే స్వయంగా వెల్లడించారు.

కాగా... పీలే కి మొత్తం మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి ఇద్దరి భార్యల ద్వారా ఐదుగురు సంతానం ఉన్నారు.  - భార్యలు రోజ్‌మెరి డోస్ రీస్ చోల్బి , అస్సిరియా లెమోస్ సీక్సాస్ -  పిల్లలు కెల్లీ (50 సంవత్సరాలు), ఎడిన్హో (50), జెన్నిఫర్ (42), కవలలు జాషువా మరియు సెలెస్ట్ (24).

తనకు ఉన్న ఎఫైర్స్ గురించి తన మొదటి భార్య, గర్ల్ ఫ్రెండ్స్ కి తెలుసని.. వాళ్లకు తానెప్పుడూ అబద్ధం చెప్పలదేని ఆయన చెప్పడం గమనార్హం. కాగా.. సాండ్రాను మాత్రం ఆయన తన కుమార్తెగా అంగీకరించలేదు. పీలే.. తమ ఇంట్లో పనిచేసే పనిమినిషితో పెట్టుకున్న అక్రమ సంబంధం కారణంగా.. సాండ్రా జన్మించింది. కాగా.. ఆమె కూడా 2006లొ క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. 

click me!