నేమర్‌ని ముంచిన పేకాట... ఆన్‌లైన్ పోకర్‌లో రూ.9 కోట్లు పోగొట్టుకున్న బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్...

By Chinthakindhi RamuFirst Published Mar 31, 2023, 7:59 PM IST
Highlights

మోకాలి గాయంతో ఫుట్‌బాల్ గేమ్‌కి దూరంగా నేమర్ జూనియర్... ఆన్‌లైన్ పోకర్‌లో 8,80,000 పౌండ్లు నష్టపోయిన నేమర్.. 

పేకాట కారణంగా ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. అందుకే డబ్బులు పెట్టి పేకాట ఆడటాన్ని చట్టరీత్యా నేరంగా మారుస్తూ చట్టాలు కూడా తీసుకొచ్చారు. అయితే పేకాట రూపం మార్చుకుని ఇప్పుడు ప్రతీ ఇంట్లో తిష్ట వేస్తోంది. ఆన్‌లైన్ రమ్మీ పేరుతో బెట్టింగ్‌ని అధికారికంగా మొబైల్ ఫోన్లలోకి తీసుకొచ్చింది టెక్నాలజీ...

తాజాగా బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమర్, ఆన్‌లైన్ పేకాట ఆడి కోట్ల రూపాయలు నష్టపోయాడు. పారిస్ సెయింట్ జర్మన్ తరుపున ఆడుతున్న నేమర్ జూనియర్, ఆన్‌లైన్ పోకర్ ఆడి, కోట్ల రూపాయలు నష్టపోయిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

📢Neymar JR pokerde tam 1 milyon Euro kaybetti. pic.twitter.com/0C3q55Xacw

— duyurduk (@duyurduk)

మోకాలి గాయంతో బాధపడుతున్న నేమర్ జూనియర్, ప్రస్తుతం ఫుట్‌బాల్ ఆటకు దూరంగా ఉన్నాడు. ఆన్‌లైన్ పోకర్ గేమ్‌లో గంటలో 8,80,000 పౌండ్లు నష్టపోయాడు. భారత కరెన్సీలో దీని విలువ అక్షరాల 8 కోట్ల 95 లక్షల 32 వేల రూపాయలు అంటే దాదాపు 9 కోట్ల రూపాయలు...

పోకర్‌లో ఇంత సొమ్ము పోవడంతో తట్టుకోలేకపోయిన నేమర్ జూనియర్, చిన్నపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకుంటూ అరుస్తున్న వీడియో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న  సాకర్ ప్లేయర్లలో ఒకడైన 31 ఏళ్ల నేమర్ జూనియర్, ఆస్తుల విలువ దాదాపు 77 మిలియన్ల పౌండ్లు (దాదాపు 783 కోట్ల రూపాయలు)... 

బ్రెజిల్ టీమ్ తరుపున 77 అంతర్జాతీయ గోల్స్ చేసిన నేమర్ జూనియర్, సాంటోస్, బార్సీలోనా, పారిస్ సెయింట్ జర్మన్ క్లబ్స్ తరుపున 257 గోల్స్ సాధించాడు. క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోవర్లు కలిగిన ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఉన్నాడు నేమర్ జూనియర్...

 

click me!