బర్గర్ వెజ్ తింటున్నారా నాన్ వెజ్..?

By telugu news team  |  First Published Jul 29, 2020, 2:54 PM IST

మీరు వెజ్ బర్గర్ తినడానికి ఇష్టపడుతున్నారా.. లేదా నాన్ వెజ్ బర్గరా..? ఏదైతే ఏముంది అని మాత్రం తీసిపారేయకండి. బర్గర్ ఆరోగ్యానికి అంత ఉపయోగకరమైనది కాకపోయినా.. కొంతలో కొంత వెజ్ బర్గర్ మాత్రం నయమని నిపుణులు చెబుతున్నారు. 
 


ఒకప్పుడు పూర్వీకులు జ్వరం వస్తే తప్ప.. బ్రెడ్చ బన్ను లాంటివి ముట్టుకునేవారు కాదు. కానీ.. ప్రస్తుతం వాటినే కొంచెం మోడ్రన్ గా మార్చి బర్గర్ అనగానే.. మనమంతా విపరీతంగా లాగించేస్తున్నారు. దాదాపు జనాలకు ఈ ఫుడ్ బాగా అలవాటు అయిపోయిందనే చెప్పాలి. ఇవి తినకూడదు జంక్ ఫుడ్ అని చెప్పినా కూడా తినడం మానలేకపోతున్నారు. 

ఇక బయటతినే బర్గర్స్ వల్ల.. విపరీతంగా బరువు పెరిగే ప్రమాదం లేకపోలేదు. ఒక్క హ్యాంబర్గర్ లో 500 కేలరీలు ఉంటాయి. అందులో 25 గ్రాముల కొవ్వు, 40 గ్రామ్స్ క్రాబ్స్, పది గ్రాముల షుగర్, వెయ్యి మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. 

Latest Videos

ఒక్క బర్గర్ తినగానే.. మనకు కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అయితే.. కొద్దిసేపటికే మళ్లీ ఆకలి మొదలౌతుంది. ఎందుకంటే.. బర్గర్ తిన్న 15నిమిషాల తర్వాత మీ శరీరంలో గ్లూకోజ్ శాతం పెరిగిపోతోంది. అది ఇన్సులిన్ విడుదల చేస్తుంది. దాని కారణంగానే.. కొద్ది గంటల్లోనే మళ్లీ ఆకలి మౌదలౌతుంది. దీంతో మళ్లీ ఏదో ఒకటి తినేస్తుంటాం. ఇలా తరచూ బర్గర్ తినడం వల్ల అధికంగా బరువు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా సోడియం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 

ఈ సంగతి పక్కన పెడితే.. మీరు వెజ్ బర్గర్ తినడానికి ఇష్టపడుతున్నారా.. లేదా నాన్ వెజ్ బర్గరా..? ఏదైతే ఏముంది అని మాత్రం తీసిపారేయకండి. బర్గర్ ఆరోగ్యానికి అంత ఉపయోగకరమైనది కాకపోయినా.. కొంతలో కొంత వెజ్ బర్గర్ మాత్రం నయమని నిపుణులు చెబుతున్నారు. 

సాధారణంగా బర్గర్ల తయారీలో ఉప్పు వినియోగం కొంచెం అధికంగా ఉంటుంది. ఉప్పులో ఉండే సోడియం కారణంగా రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ తయారీలో సోడియం అధికంగా ఉంటుంది. బీఫ్‌, చికెన్‌ బర్గర్లల్లో వినియోగించే మాసం విషయంలో ప్రభుత్వ పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉండటంతో నాసిరకం మాంసం/కుళ్ళిన మాంసం వినియోగించే ప్రమాదం ఉంది. 

బర్గర్ల తయారీలో నాణ్యమైన నూనెలు, పప్పులు, ధాన్యాలు, కూరగాయల వినియోగంపై అనుమానాలు కలగడం సహజం. అందువల్ల మాంసాహార బర్గర్లకన్నా శాకాహార బర్గర్లే మేలని, వీటిలోనే సమృద్ధిగా పోషకాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోనే బర్గర్లను తయారు చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ పొందే వీలుంటుంది. 

ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తుంది కాబట్టి.. ఇలాంటి సమయంలో బయటి ఆహారం ఏదైనా ప్రమాదమే. కాబట్టి.. ఆ తినే బర్గర్లు ఇంట్లోనే చేసుకొని తింటే.. రుచితో పాటు ఆరోగ్యం కూడా సొంతమౌతుంది. మరీ ముఖ్యంగా వెజ్ బర్గర్ ప్రిఫర్ చేయడం మరీ మంచిది. ఇంట్లో తయారు చేసుకునే వాటిలో సోడియం లాంటివి కలిసే అవకాశం ఉండదు. కాబట్టి కొంతవరకు బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.
 

click me!