IPS uday krishna reddy: ఇతని జీవితం యువతకు పెద్ద పాఠం.. క్రమశిక్షణ లేని ఏ గెలుపూ నిలబడదు

Published : Jul 28, 2026, 09:14 PM IST
Ips uday krishna reddy life is a big lesson for the youth

సారాంశం

Ips uday krishna reddy: ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్‌ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదిలి, కష్టపడి ఐపీఎస్ సాధించిన అధికారి. తోటి మహిళా అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో కెరీర్ కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు.

ఐపీఎస్.. దీన్ని సాధించడం సామాన్యమైన విషయం కాదు. ఇది అద్భుత ప్రతిభకు నిదర్శనం. ఆ ఖాకీ యూనిఫాం సమాజంలో అత్యున్నత గౌరవాన్ని ఇస్తుంది. అంతటి గొప్ప ఉద్యోగాన్ని సాధించాక దాన్ని నిలబెట్టుకునేందుకు అంతే బాధ్యతగా వ్యవహరించాలి. కానీ తాను చేసిన తప్పు వల్ల పెద్ద శిక్షకు గురయ్యే పరిస్థితితో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి. అతను తప్పు చేశాడో లేదో ఇంకా తేలలేదు.. ఒకవేళ చేసి ఉంటే అతని ఐపీఎస్ కెరీర్ ముగింపుకు వచ్చినట్టే. విజయం సాధించడం చాలా కష్టం... అలాగే ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం కూడా ఇంకా కష్టమని ఇతని జీవితమే పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఒకప్పుడు రోల్ మోడల్

ఒక సాధారణ కుటుంబంలో ఉదయ్ కృష్ణారెడ్డి జన్మించారు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగం చేస్తూనే ఐపీఎస్ అవ్వాలన్న తన కలను వదల్లేదు. రాత్రింబవళ్లు కష్టపడి చదివారు. పట్టుదలతో యూపీఎస్సీ పరీక్షను ఛేదించారు. ఐపీఎస్ అధికారిగా విజయం సాధించారు. సాధించాలనే పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపించారు. పోటీ పరీక్షలు రాసే ప్రతీ ఒక్కరికీ ఒక రోల్ మోడల్‌గా మారారు.

అయితే విజయం సాధించడం ఎంత ముఖ్యమో... దాన్ని కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం. ఐపీఎస్ హోదా వచ్చాక ఆయన ప్రవర్తనపై ఇప్పుడు ఆరోపణలు భారీగా వచ్చాయి. సహచర అధికారి పట్ల తప్పుగా ప్రవర్తించారని.. చట్టపరమైన కేసుల్లో చిక్కుకుని పోలీసుల అదుపులోకి వెళ్లారు. ఎంతో కష్టపడి సాధించిన హోదా ఒక్కసారిగా పోయింది. సమాజంలో లభించిన గౌరవం క్షణాల్లో తలకిందులైంది. ఎంత గొప్ప ప్రతిభ ఉన్నా సరైన నడవడిక లేకపోతే ఆ విజయం వ్యర్థమని తేలిపోయింది.

ఈ సంఘటన నేటి యువతకు ఒక పెద్ద పాఠం. ఉన్నత స్థానానికి చేరడానికి ఏళ్ల తరబడి శ్రమించాలి. కానీ కిందకు పడిపోవడానికి ఒక్క క్షణం చాలు. ఒక చిన్న తప్పు జీవితాంతం చేసిన కష్టాన్ని బూడిద చేస్తుంది. అధికారంతో పాటు బాధ్యత కూడా పెరగాలి. చట్టం ముందు అందరూ సమానులే అని గ్రహించాలి. గెలుపు అనేది ఎప్పుడూ తలకెక్కకూడదు. క్రమశిక్షణ లేని ఏ గెలుపూ నిలబడదు.

జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే అసలైన విజయం. కేవలం ఉద్యోగం రావడం మాత్రమే గొప్ప కాదు. మంచి ప్రవర్తనతో జీవించడమే నిజమైన గెలుపు. కాబట్టి కలలు కనండి. వాటి కోసం కష్టపడండి. కానీ మీ విలువలను ఎప్పుడూ వీడకండి. తోటి మనుషులను గౌరవించండి. శ్రమతో సాధించిన విజయం శాశ్వతంగా ఉండాలంటే క్రమశిక్షణే ముఖ్యమని గుర్తుంచుకోండి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Motivational: విజ‌యం, డ‌బ్బు, గౌర‌వం.. మ‌నిషికి శాశ్వ‌త ఆనందం ల‌భించేది ఎప్పుడో తెలుసా.?
రైల్వే స్టేష‌న్ల‌లో లోకో పైల‌ట్లు రింగ్ ఎందుకు మార్చుకుంటారు.? దీని ఉప‌యోగం ఏంటో తెలుసా?