Pushpa 2 :kgf2 ఇంపాక్ట్ అల్లు అర్జున్ పై ఎంతలా పడిందంటే,మొత్తం మార్చేస్తున్నాడు.!

By Surya Prakash  |  First Published Apr 19, 2022, 6:42 PM IST

‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ ఎక్సపెక్టేషన్స్ ని మించి విజయాన్ని అందుకుంది. లాంగ్ వీకెండ్ ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ సినిమాకి అదనపు బోనస్ అయ్యిందని అంటున్నారు. ఎలా చూసుకున్నా, ‘కేజీఎఫ్’ లానే, ‘పుష్ప’ కూడా ఓ బ్రాండ్ అయిపోయింది. 


KGF చాప్టర్ 2 సక్సెస్ లెక్కలనే  మార్చేసింది. అలాగే, పుష్ప హిందీ మార్కెట్‌లో చాలా బాగా వర్కవుట్ అయ్యింది. దాంతో అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2పై పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నాడు. అల్లు అర్జున్ రాబోయే రెండేళ్లపాటు పుష్ప 2పై దృష్టి పెట్టనున్నాడని సమాచారం. ఆ తర్వాత మిగతావన్ని అని సన్నిహితులతో చెప్తున్నార్ట. ఇప్పటిదాకా అల్లు అర్జున్ లెక్కలు వేరు. ఎప్పుడైతే కేజీఎఫ్ 2 వచ్చి ఓ రేంజిలో సక్సెస్ అయ్యిందో...దాన్ని మించిన టార్గెట్ బన్ని మైండ్ లో ఫిక్స్ చేసుకున్నాడంటున్నారు.  
 
 ఇక   ‘పుష్ప ది రైజ్’ హిందీ మార్కెట్‌నీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్‌కి పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడింది. పాన్ ఇండియా స్టార్‌గా అల్లు అర్జున్ తన ఇమేజ్‌ని మరింత బలోపేతం చేసుకునేందుకోసం.. ‘పుష్ప ది రూల్’ ఎంతగానో ఉపయోగపడనుంది. అయితే, ‘పుష్ప ది రూల్’కి అప్పుడే తొలి టార్గెట్ ఫిక్స్ అయిపోయినట్లు కనిపిస్తోంది. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ హిందీ బెల్ట్‌లో తొలి రోజు 50 కోట్ల పైన వసూలు చేసిన విషయం విదితమే. మొత్తం 53 కోట్లను తొలి రోజు వసూలు చేసింది ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’. ఈ నేపథ్యంలో ‘పుష్ప ది రైజ్’ ముందుగా కొట్టాల్సింది ఈ 53 కోట్ల రికార్డునే అంటున్నారు ట్రేడ్ లో .
 
‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ ఎక్సపెక్టేషన్స్ ని మించి విజయాన్ని అందుకుంది. లాంగ్ వీకెండ్ ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ సినిమాకి అదనపు బోనస్ అయ్యిందని అంటున్నారు. ఎలా చూసుకున్నా, ‘కేజీఎఫ్’ లానే, ‘పుష్ప’ కూడా ఓ బ్రాండ్ అయిపోయింది. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ రికార్డుల్ని బ్రేక్ చేయడం.. ఇప్పుడు పుష్ప 2  ముందున్న తక్షణ కర్తవ్యం గా చెప్తున్నారు. దాంతో ఇప్పుడు కేజీఎఫ్ 2 ని కొట్టేలా పుష్ప స్క్రిప్టు దగ్గర నుంచి అన్నీ మార్చేస్తున్నారు.
 
అయితే, ‘పుష్ప ది రూల్’ ఇంకా సెట్స్ మీదకే వెళ్ళలేదు. మారుతున్న బాక్సాఫీస్ సమీకరణాల నేపథ్యంలో దర్శకుడు సుకుమార్, నిర్మాణ సంస్థ మైత్రీ మేకర్స్, హీరో అల్లు అర్జున్.. అన్ని ఈక్వేషన్స్‌నీ పరిగణనలోకి తీసుకుని ‘పుష్ప ది రూల్’ తెరకెక్కించాల్సి వుంది. మరో ప్రక్క హిందీ మార్కెట్ మాత్రమే కాదు, తెలుగులో ‘ఆర్ఆర్ఆర్’ రికార్డుల్ని సైతం ‘పుష్ప ది రూల్’ టార్గెట్ చేయాల్సి వుంది. ‘పుష్ప’ సినిమాకి హీరోయిన్ రష్మిక మండన్న అదనపు అడ్వాంటేజ్. ఆమె కూడా ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. 
 

click me!