బన్నీ అంటే అందుకే అంతిష్టం.. బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్!

Published : Jun 11, 2019, 04:05 PM IST
బన్నీ అంటే అందుకే అంతిష్టం.. బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్!

సారాంశం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇండియన్ సినిమా టాప్ డాన్సర్లలో ఒకడు. ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, అదిరిపోయే డాన్సులతో అల్లు అర్జున్ ఇంతటి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇండియన్ సినిమా టాప్ డాన్సర్లలో ఒకడు. ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, అదిరిపోయే డాన్సులతో అల్లు అర్జున్ ఇంతటి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ నటులు సైతం తరచుగా బన్నీ డాన్స్ గురించి ప్రస్తావిస్తుంటారు. ఎంత కష్టతరమైన స్టెప్పులనైనా బన్నీ అవలోకగా చేసేస్తాడు. బన్నీ డాన్స్ చేస్తుంటే అతడి కష్టం కనిపించదు.. స్టైల్ మాత్రం హైలైట్ అవుతుంది. 

గతంలో బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్, ఇటీవల గల్లీ బాయ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సిద్దార్థ్ చతుర్వేది అల్లు అర్జున్ డాన్సులని మెచ్చుకున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మరో హీరోయిన్ కూడా చేరింది. సల్మాన్ ఖాన్ వీర్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న జరీన్ ఖాన్ మాట్లాడుతూ టాలీవుడ్ లో తన అభిమాన హీరో బన్నీ అని తెలిపింది. 

అల్లు అర్జున్ చాలా సింపుల్ గా అదిరిపోయే డాన్స్ చేస్తాడు. అందుకే అతడంటే నాకిష్టం అని జరీన్ ఖాన్ అంటోంది. హేట్ స్టోరీ 3, వాజహ్ తుమ్ హో లాంటి రొమాంటిక్ చిత్రాలతో జరీన్ ఖాన్ పాపులర్ అయింది. ప్రస్తుతం జరీన్ ఖాన్ గోపీచంద్ సరసన 'చాణక్య' అనే యాక్షన్ మూవీలో నటిస్తోంది. జరీన్ ఖాన్ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే.   

 

PREV
click me!

Recommended Stories

రాజాసాబ్ చేయకుండా తప్పించుకున్న ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో తెలుసా? ప్రభాస్ ను బుక్ చేశారుగా
The Raja Saab 6 Days Collection: ది రాజాసాబ్‌కి ఆరో రోజు పెరిగిన కలెక్షన్లు.. ప్రభాస్‌ టార్గెట్‌కి ఎంత దూరంలో ఉన్నాడంటే