`ఈ కథలో పాత్రలు కల్పితం`చిత్ర పాట బాగుందన్న వైఎస్‌ షర్మిల

Published : Feb 13, 2021, 09:07 AM IST
`ఈ కథలో పాత్రలు కల్పితం`చిత్ర పాట బాగుందన్న వైఎస్‌ షర్మిల

సారాంశం

పవన్‌ తేజ్‌ కొణిదెలని హీరోగా పరిచయం చేస్తూ, మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో.. రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న చిత్రం 'ఈ కథలో పాత్రలు కల్పితం'.  తాజాగా శుక్రవారం ఈ చిత్రంలోని రెండో పాటని వైఎస్‌ షర్మిల విడుదల చేశారు.

`ఈ కథలో పాత్రలు కల్పితం` చిత్రంలోని రెండో పాట చాలా బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా` అని పొలిటికల్‌ లీడర్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. పవన్‌ తేజ్‌ కొణిదెలని హీరోగా పరిచయం చేస్తూ, మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో.. రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న చిత్రం 'ఈ కథలో పాత్రలు కల్పితం'. ఇందులో మేఘన హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన సినిమా పోస్టర్స్‌‌కి, సాంగ్స్‌కి, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. 

తాజాగా శుక్రవారం ఈ చిత్రంలోని రెండో పాటని వైఎస్‌ షర్మిల విడుదల చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత రాజేష్‌ నాయుడు మాట్లాడుతూ, `మా చిత్రంలోని సెకండ్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేసిన వైఎస్ షర్మిలకి హృద‌య‌పూర్వ‌క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఆడియెన్స్ థ్రిల్ ఫీలయ్యే విధంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో, ఎంటర్‌టైన్‌మెంట్ జోడించి దర్శకుడు అభిరామ్ సినిమాని రూపొందించారు. హీరో పవన్ తేజ్ కొణిదెల లాంఛింగ్ ఫిల్మ్‌తోనే అందరినీ ఆకట్టుకుంటాడు. నటీనటులందరూ ఈ చిత్రం కోసం ఎంతగానో తోడ్పడ్డారు. వారందరికీ ధన్యవాదాలు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం` అని తెలిపారు.

దర్శకుడు అభిరామ్ ఎమ్‌ మాట్లాడుతూ.. `అందరి సహకారంతో ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా నిర్మాత రాజేష్ నాయుడుగారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదు. ఆయనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే హీరోగా పరిచయం అవుతున్న పవన్ తేజ్ కొణిదెలకు ఇది పర్ఫెక్ట్ లాంచింగ్ ఫిల్మ్ అవుతుంది. ఈ సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటాడు. తాజుద్దీన్‌ సయ్యద్ డైలాగ్స్, సునీల్ కుమార్ సినిమాటోగ్రఫీ, కార్తీక్‌ కొడకండ్ల సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నాయి` అని చెప్పారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు