2020 మోస్ట్ ఇన్‌ప్లూయెన్స్ యంగ్‌ ఇండియన్స్ లిస్ట్‌లో బన్నీ, అనుష్క శర్మ

Published : Feb 13, 2021, 08:45 AM IST
2020 మోస్ట్ ఇన్‌ప్లూయెన్స్ యంగ్‌ ఇండియన్స్ లిస్ట్‌లో బన్నీ, అనుష్క శర్మ

సారాంశం

గతేడాది ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న, అనేక మందిని ప్రభావితం చేసిన 25మంది యువ డైనమిక్‌ ఇండియన్స్ లిస్ట్ ని ప్రముఖ ఇండియన్‌ బేస్డ్ అమెరికన్‌ మేగజీన్‌ జిక్యూ ఇండియా ప్రకటించింది. ఇందులో బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ, టాలీవుడ్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ చోటు సంపాదించారు.

గతేడాది ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న, అనేక మందిని ప్రభావితం చేసిన 25మంది యువ డైనమిక్‌ ఇండియన్స్ లిస్ట్ ని ప్రముఖ ఇండియన్‌ బేస్డ్ అమెరికన్‌ మేగజీన్‌ జిక్యూ ఇండియా ప్రకటించింది. ఇందులో బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ, టాలీవుడ్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ చోటు సంపాదించారు. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ భార్యగా, బాలీవుడ్‌ నటిగా అనుష్క శర్మ గతేడాది ఇండియన్స్ ని అటు సోషల్‌ మీడియాలోనూ, ఇటు పలు విశేషాల కారణంగా ఎంతగానో ప్రభావితం చేశారట. ఆమె ప్రెగ్నెంట్‌ అనేది కూడా అందులో భాగమే.

అలాగే `అలవైకుంఠపురములో` సూపర్‌ హిట్‌ కావడం, ఈ చిత్ర పాటలు వంద మిలియన్స్ కి పైగా వ్యూస్‌ని సాధించడం వంటి కారణాలతో బన్నీని ఎంపిక చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి అల్లు అర్జున్‌, అనుష్క శర్మలు ఎంపిక కావడం విశేషం. విభిన్న రంగాలకు చెందిన వారిని ఈ లిస్ట్ లో ఎంపిక చేశారు. గతేడాది కరోనా కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తాయి. కొన్నాళ్లపాటు ప్రపంచమే ఆగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా వీరి గురించిన చర్చ జరిగింది. ఇందులో అనుష్క శర్మకి ఐదో స్థానం దక్కగా, విరాట్‌ కొహ్లీకి 16వ స్థానం దక్కింది. 

ప్రస్తుతం అల్లు అర్జున్‌ `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా దీన్ని దర్శకుడు సుకుమార్‌ రూపొందిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం చిన్న గ్యాప్‌ తీసుకున్నారు. మరోవైపు అనుష్క శర్మ గత నెలలో పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. పాపకి వామిక అనే పేరు పెట్టారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది