లైంగిక వేధింపుల కేసులో నటుడు బెహరా ప్రసాద్‌ అరెస్ట్‌

By Surya Prakash  |  First Published Dec 18, 2024, 6:08 PM IST

షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరిస్ ద్వారా గుర్తింపు పొందిన నటుడు బెహరా ప్రసాద్ సహచర నటిని వేధించినందుకు అరెస్టు అయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ప్రసాద్‌ను కోర్టులో హాజరుపరిచారు.


రీసెంట్ టైమ్స్ లో షార్ట్ ఫిలిమ్స్ , యూట్యూబ్ వెబ్ సీరిస్ ద్వారా మంచి గుర్తింపు సాధించి సినిమాల్లో అవకాశాలు అందుకున్న నటుడు బెహరా ప్రసాద్. ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు పొందుతూ,  గుర్తింపు  తెచ్చుకుంటున్న టైమ్ లోనే   తప్పటడుగులు పడింది.   సహచర నటిని వేధించిన కేసులో బెహరా ప్రసాద్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. మణికొండకు చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసాద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ఓ వెబ్‌సిరీస్‌ షూటింగ్‌ సమయంలో ప్రసాద్‌ తనకు పరిచయమయ్యాడని యువతి తెలిపింది. షూట్‌లో భాగంగా అసభ్యంగా ప్రవర్తించాడని.. నిలదీయడంతో క్షమాపణలు చెప్పాడని పేర్కొంది. కొద్ది రోజుల తర్వాత మరో వెబ్‌ సిరీస్‌లో కలిసి పనిచేశామని, ఆ సమయంలో అందరి ముందు అసభ్యంగా ప్రవర్తించాడని యువతి తెలిపింది. 

Latest Videos

undefined

ఇదేమిటని ప్రశ్నించగా అసభ్య పదజాలంతో దూషించాడని, ఈ నెల 11న షూటింగ్‌ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో యూనిట్‌ అందరి ముందు తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి వారం అండి అనే వెబ్ సిరీస్ టైంలో హరాస్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది, అలానే మెకానిక్ అనే వెబ్ సిరీస్ టైంలో కూడా తనపై హరాస్మెంట్ చేశాడు అని వినిపిస్తోంది.

 బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్‌ను కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి.. 14 రోజుల రిమాండ్‌ విధించారు. నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

click me!