
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తన అభిమానులను, ప్రేక్షకులను ఫిదా చేసే పనిలో ఉన్నారు. ఆయన సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ మెంబర్ తో గడిపేందుకు మాత్రం సపరేట్ సమయం కేటాయిస్తారు. ముఖ్యంగా భార్యా, పిల్లలు అంటే తారక్ కి ప్రాణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులను, పిల్లలకు మీడియాకు కాస్తా దూరంగా ఉంచుతారు. ఏ పండుగలో, ప్రత్యేక రోజుల్లోనో ఫ్యామిలీతో కనిపిస్తారు. మిగితా సమయంలో కుటుంబ సభ్యులతో కనిపించడం కష్టమనే చెప్పాలి.
అలాంటిది తాజాగా ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మి ప్రణతి (Lakshmi Pranathi)తో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నాడు. ఎప్పుడో గానీ కనిపించని ఇలాంటి రేర్ పిక్ ను ఎన్టీఆర్ తాజాగా అభిమానులతో పంచుకోవడం పట్ల ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పిక్ లో ఎన్టీఆర్, ప్రణతి కాఫీ తాగుతూ తన భార్య కోసం కొనుగోలు చేసిన ఫామ్ హౌజ్ లో సరదాగా గడిపారు. ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ స్వీట్ మెమోరీస్ క్రియేట్ చేసుకుంటున్నారు. స్వచ్ఛమైన గాలిని పీల్చుతూ సంతోష క్షణాల్లో మునిగితేలారు. తమ అభిమాన హీరో.. ఇలా ఫ్యామిలీతో సంతోషంగా ఉండటం చూసిన ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ రొమాంటిక్ పిక్ ను వైరల్ చేస్తున్నారు.
ఇటీవల రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని గోపాలపురం గ్రామ పరిధిలోని ఆరున్నర ఎకరాల భూమిలో ఎన్టీఆర్ ఫామ్ హౌజ్ ను నిర్మించిన విషయం తెలిసిందే. దాన్ని ఇటీవల తన సతీమణి లక్ష్మీ ప్రణతికి బర్త్ డేకు గిఫ్ట్ గా ఇచ్చారని సమాచారం. ఇక ఆ ఫామ్ హౌస్ కి 'బృందావనం' అని పేరు పెట్టడం విశేషం. తాజాగా ఆ ఫౌమ్ హౌజ్ లోనే కబుర్లు చెప్పుకుంటూ.. సరదగా సమయాన్ని గడపుతున్నారు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’తో ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్... ప్రస్తుతం కొరటాల శివ, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్నారు. త్వరలోనే కొరటాల శివతో నటించనున్న ‘ఎన్టీఆర్ 30’ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ 31’ మొదలు కానుంది.