మా గుండెలని మరొక్కసారి తాకిపోండి తాతా.. జూ.ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్ 

Published : May 28, 2023, 12:06 PM IST
మా గుండెలని మరొక్కసారి తాకిపోండి తాతా.. జూ.ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్ 

సారాంశం

స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి నేడు. నటుడిగా, నాయకుడిగా అభిమానుల గుండెల్లో ఇలవేల్పుగా మారిన ఎన్టీఆర్ శతజయంతి నాడు తెలుగువారంతా ఆయన్ని స్మరించుకుంటున్నారు.

స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి నేడు. నటుడిగా, నాయకుడిగా అభిమానుల గుండెల్లో ఇలవేల్పుగా మారిన ఎన్టీఆర్ శతజయంతి నాడు తెలుగువారంతా ఆయన్ని స్మరించుకుంటున్నారు. శతజయంతి సందర్భంగా అభిమానులు, తారలు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. 

నందమూరి వారసుడిగా తాతకి తగ్గ మనవడిగా యంగ్ టైగర్ ఎన్టీర్ పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తిరుగులేని క్రేజ్ తో తారక్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. కాగా నేడు ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా జూ.ఎన్టీఆర్ ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 

మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానరాక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనస్సుతో ఈ ధరిత్రిని ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. 

 

కాగా ఈ ఉదయం ఎన్టీఆర్.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తాత సమాధికి నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే.  జూ.ఎన్టీఆర్ రావడంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీనితో అక్కడ కాస్త తోపులాట జరిగింది. అభిమానుల తోపులాట లోనే తారక్ నివాళులు అర్పించి వెళ్లారు. ఫ్యాన్స్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. నందమూరి కుటుంబ సభ్యులంతా తరలివెళ్లి ఎన్టీఆర్ కి నివాళులు అర్పించారు.  అయితే తారక్.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకకలు హాజరు కాకపోవడంతో పెద్ద చర్చే జరుగుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌