నాని 'దసరా'లో క్రేజీ మలయాళీ నటుడు.. ఇంటరెస్టింగ్ డీటెయిల్స్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 22, 2022, 12:52 PM IST
నాని 'దసరా'లో క్రేజీ మలయాళీ నటుడు.. ఇంటరెస్టింగ్ డీటెయిల్స్

సారాంశం

నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా శ్యామ్ సింగ రాయ్ చిత్రంతో విజయం సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రంలో నాని రెండు పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. శ్యామ్ పాత్రలో నటనకు నానికి ప్రశంసలు దక్కాయి. 

నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా శ్యామ్ సింగ రాయ్ చిత్రంతో విజయం సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రంలో నాని రెండు పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. శ్యామ్ పాత్రలో నటనకు నానికి ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉండగా నాని నటిస్తున్న తదుపరి చిత్రం 'దసరా'. డెబ్యూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో నాని తెలంగాణ యాసలో డైలాగులు చెప్పబోతున్నాడు. ఆ మధ్యన విడుదలైన మోషన్ పోస్టర్ లో నాని లుక్ రఫ్ గా ఉండబోతున్నట్లు అర్థం అయింది. ఈ చిత్రంలో నాని పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉండబోతున్నాయి. 

ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీలో మలయాళీ యువ క్రేజీ నటుడు రోషన్ మ్యాథ్యు కీలక పాత్రలో నటించబోతున్నాడు. మలయాళంలో రోషన్ నటుడిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దసరా చిత్రంలో నాని స్నేహితుడి పాత్ర కోసం రోషన్ మథ్యూని ఎంపిక చేసుకున్నారు. 

సినిమా మొత్తం రోషన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉండదట. నటనకు కూడా చాలా స్కోప్ ఉన్న పవర్ ఫుల్ రోల్ అని చెబుతున్నారు. సో రోషన్ కి దసరా చిత్రం తెలుగులో డ్రీం డెబ్యూ అని ముందే చెప్పేయొచ్చు. 

ఈ చిత్రంలో నానికి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్