రవితేజ కోసం బోల్డ్ రోల్ లో యంగ్ హీరోయిన్!

Published : Jul 09, 2019, 08:36 PM IST
రవితేజ కోసం బోల్డ్ రోల్ లో యంగ్ హీరోయిన్!

సారాంశం

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం డిస్కోరాజా. విఐ ఆనంద్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ చిత్రం తెరక్కుతోంది. రవితేజకు ఈ చిత్రం విజయం సాధించడం చాలా కీలకం. 

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం డిస్కోరాజా. విఐ ఆనంద్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ చిత్రం తెరక్కుతోంది. రవితేజకు ఈ చిత్రం విజయం సాధించడం చాలా కీలకం. వరుస పరాజయాలతో ఉన్న రవితేజ మార్కెట్ ఇప్పటికే దెబ్బతింది. 

డిస్కోరాజాలో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో హీరోయిన్ కు కూడా ఈ చిత్రంలో అవకాశం ఉంది. కీలక పాత్ర కోసం యంగ్ హీరోయిన్ తన్యా హోప్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. కథలో భాగంగా తన్యా హోప్ పాత్ర బోల్డ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

రవితేజ, తన్యా హోప్ పై ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందట. పేపర్ బాయ్, పటేల్ ఐఎస్ఆర్ లాంటి చిన్న చిత్రాల్లో నటించిన తన్యా హోప్ కు సరైన గుర్తింపు లభించలేదు. డిస్కోరాజా చిత్రం ఆమెకు మంచి గుర్తింపు ఇస్తుందేమో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి