డీజే టిల్లుగాడికి హ్యాండిచ్చిన శ్రీ లీల.. సీక్వెల్‌ నుంచి ఔట్‌.?

Published : Sep 23, 2022, 04:15 PM ISTUpdated : Sep 23, 2022, 04:17 PM IST
డీజే టిల్లుగాడికి హ్యాండిచ్చిన శ్రీ లీల.. సీక్వెల్‌ నుంచి ఔట్‌.?

సారాంశం

`పెళ్లిసందడి` భామ శ్రీ లీల  ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఈ క్యూట్‌ బ్యూటీ `డీజే టిల్లు`కి హ్యాండిచ్చిందట.   

టాలీవుడ్‌లోకి సైలెంట్ గా దూసుకొచ్చింది శ్రీలీల. క్యూట్‌ అందాలతో తెలుగు ఆడియెన్స్ ని ఫిదా చేసింది. `పెళ్లి సందడి` సినిమాతో ఆకట్టుకున్న శ్రీ లీలకి వరుసగా అవకాశాలు వచ్చాయి. స్టార్‌ హీరోలతోనూ ఆఫర్లు వచ్చాయి. ఓవర్‌ నైట్‌లో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఆమె `డీజే టిల్లు` సీక్వెల్‌లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. 

ఇటీవల విడుదలైన `డీజేటిల్లు` సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం అతి తక్కువ బడ్జెట్‌తో రూపొంది ఊహించని విధంగా భారీ కలెక్షన్లని సాధించింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌పై అంచనాలు నెలకొన్నాయి. అందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని అందుకుంది. ఆమె ఓకే చెప్పడమే కాదు, ఏకంగా షూటింగ్‌ వరకు వెళ్లిందట. కానీ ఊహించని విధంగా `డీజే టిల్లు 2` నుంచి శ్రీ లీల వైదొలిగినట్టు సమాచారం. 

కారణాలు తెలియనప్పటికీ షూటింగ్‌ స్టార్ట్ అయిన రెండు రోజులకే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. శ్రీ లీల బయటకు వెళ్లిపోవడంతో మరో హీరోయిన్‌ కోసం చిత్ర బృందం అన్వేషిస్తుందట. ప్రస్తుతం హీరోయిన్‌ని కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సిద్ధు హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

శ్రీలాల చేతిలో ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్ట్ లున్నాయి. మాస్‌ మహారాజా రవితేజతో `ధమాకా` చిత్రంలో నటించింది. ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. దీంతోపాటు `అనగనగా ఒక రోజు` చిత్రంలో నటిస్తుంది. అలాగే గాలి జనార్థన్‌రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న సినిమాలోనూ హీరోయిన్‌గా ఎంపికైందని సమాచారం. మరోవైపు ప్రభాస్‌తో మారుతి చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఓ కథానాయికగా నటించబోతుందని సమాచారం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం