బిగ్ బాస్ 5 మొదటి కంటెస్టెంట్ గా యువ హీరో...?

By team teluguFirst Published Feb 1, 2021, 3:18 PM IST
Highlights

బిగ్ బాస్ సీజన్ 5కి ఎంపికైన మొదటి కంటెస్టెంట్ ఇతడే అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. యూట్యూబ్ స్టార్ నటుడు షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి పచ్చ జెండా ఊపాడని అంటున్నారు. సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన షణ్ముఖ్ ని సంప్రదించడంతో పాటు, అతని ఎంపిక కూడా పూర్తి చేశారని అంటున్నారు. 
 

బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నాగార్జున హోస్ట్ గా సాగిన సీజన్ 4 టైటిల్ విన్నర్ గా అభిజీత్ నిలిచాడు. బిగ్ 4 బాస్ ఫినాలే రికార్డు టీఆర్పీ అందుకొని నిర్వాహకులలో జోష్ నింపింది. కరోనా వైరస్ కారణంగా గత సీజన్ ఆలస్యంగా ప్రసారం అయ్యింది. దీనితో సీజన్ 5 త్వరగా ప్రారంభించాలని స్టార్ మా యాజమాన్యం ప్రణాళికలు వేస్తున్నారట. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా మొదలైపోయిందన్న మాట వినిపిస్తుంది. 

సీజన్ 4 సక్సెస్ నేపథ్యంలో పాపులారిటీ ఉన్న సెలెబ్రిటీలను హౌస్ లోకి పంపాలని ఆలోచన చేస్తున్నారట నిర్వాహకులు. కాగా బిగ్ బాస్ సీజన్ 5కి ఎంపికైన మొదటి కంటెస్టెంట్ ఇతడే అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. యూట్యూబ్ స్టార్ నటుడు షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి పచ్చ జెండా ఊపాడని అంటున్నారు. సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన షణ్ముఖ్ ని సంప్రదించడంతో పాటు, అతని ఎంపిక కూడా పూర్తి చేశారని అంటున్నారు. 

యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిల్మ్స్ లో షణ్ముఖ్ నటించడం జరిగింది. అయితే ఆ మధ్య విడుదలైన సాఫ్ట్ వేర్ డెవ్ లవ్ పర్ సిరీస్ షణ్ముఖ్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సిరీస్ యూత్ కి బాగా కనెక్ట్ కావడంతో పాటు, హీరోగా నటించిన షణ్ముఖ్ పాప్యులర్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ కి షణ్ముఖ్ ఎంపికయ్యాడో లేదో తెలియదు కానీ, ఈ వార్త ప్రముఖంగా ప్రచారం అవుతుంది. 

click me!