మాస్ మహారాజ్ రవితేజకు సవాల్ విసురుతున్న నిఖిల్.. రిలీజ్ బరిలో ఇద్దరు హీరోల సినిమాలు..

Published : Mar 24, 2022, 04:16 PM IST
మాస్ మహారాజ్ రవితేజకు సవాల్ విసురుతున్న నిఖిల్.. రిలీజ్ బరిలో ఇద్దరు హీరోల సినిమాలు..

సారాంశం

తెలుగు తెరపై ఫుల్ యాక్టీవ్ గా ఉండే హీరోలలో సీనియర్ హీరో రవితేజ తో పాటు యంగ్ స్టార్ నిఖిల్ కూడా ఉన్నారు. ఈ ఇద్దరు హీరోల ఎనర్జీ లెవల్స్ దాదాపు ఒకే  లెవల్లో ఉంటాయి. మరి ఈ ఇద్దరి సినిమాలు పోటా పోటీగా బరితో దిగితే. 

తెలుగు తెరపై ఫుల్ యాక్టీవ్ గా ఉండే హీరోలలో సీనియర్ హీరో రవితేజ తో పాటు యంగ్ స్టార్ నిఖిల్ కూడా ఉన్నారు. ఈ ఇద్దరు హీరోల ఎనర్జీ లెవల్స్ దాదాపు ఒకే  లెవల్లో ఉంటాయి. మరి ఈ ఇద్దరి సినిమాలు పోటా పోటీగా బరితో దిగితే. 

ఫస్ట్ నుంచీ కూడా యంగ్ హీరో నిఖిల్.. మాస్ మహారాజ్ రవితేజ మాదిరిగానే తెరపై చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటాడు. ఆయన మాదిరిగానే వరుస సినిమాలు చేయడానికి ట్రై చేస్తుంటాడు. యాటీట్యూడ్.. అల్లరి.. చిలిపి పనులు.. ఇలా చాలా విషయాల్లో ఇద్దరు ఒకే విధంగా కనిపిస్తారు. అలాంటిది వీరిద్దరి సినిమా ఒకేసారి బరిలో దిగితే..  నిఖిల్ నెక్ట్స్ సినిమాతో రవితేజతో పోటీకి దిగనున్నట్టుగా తెలుస్తోంది.

 నిఖిల్ తాజా  సినిమా 18  పేజెస్ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈమూవీకి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను, బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. మరో పది రోజుల్లో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకోనుంది. ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ జూన్ 17న 18 పేజెస్ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. 

అయితే అదే రోజున రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమా థియేటర్లకు రానుంది. ఈ విషయాన్ని రీసెంట్ గా అధికారికంగా ప్రకటించారు  మూవీ టీమ్. 18 పేజెస్ తరువాత కార్తికేయ 2 ను కూడా నిఖిల్ రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా  అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఇక మాస్ మహారాజ్, యంగ్ తరంగ్ నిఖిల్ సినిమాలో ఏ సినిమా సక్సెస్ సాధిస్తుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే