చిరంజీవి, బాలయ్యలను టార్గెట్‌ చేసిన యంగ్‌ హీరో.. ఏ విషయంలో అంటే ?

Published : Sep 14, 2022, 09:00 PM ISTUpdated : Sep 14, 2022, 09:02 PM IST
చిరంజీవి, బాలయ్యలను టార్గెట్‌ చేసిన యంగ్‌ హీరో..  ఏ విషయంలో అంటే ?

సారాంశం

`మెగాస్టార్‌ చిరంజీవి, బాలయ్యబాబులను టార్గెట్‌గా చేసుకుని సినిమా రంగంలోకి వచ్చానని చెప్పారు యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం.  టాలీవుడ్‌లో కెరీర్‌ ప్రారంభంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు కిరణ్‌.

`మెగాస్టార్‌ చిరంజీవి, బాలయ్యబాబులను టార్గెట్‌గా చేసుకుని సినిమా రంగంలోకి వచ్చానని చెప్పారు యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం.  టాలీవుడ్‌లో కెరీర్‌ ప్రారంభంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు కిరణ్‌. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా స్వతహాగా ఎదుగుతూ వస్తున్నారు. `రాజావారు రాణిగారు`, `ఎస్‌ ఆర్‌ కళ్యాణమండపం` చిత్రాలతో ఒక్కసారిగా హీరోగా దూసుకొచ్చాడు. వరుస సినిమాలతో ఆడియెన్స్ ని బ్యాక్‌ టూ బ్యాక్‌ అలరిస్తున్నారు. 

తాజాగా ఆయన `నేను మీకు బాగా కావాల్సినవాడిని` చిత్రంతో ఈ శుక్రవారం(సెప్టెంబర్‌ 16) ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా కిరణ్‌ పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు. తనకు మాస్‌, యాక్షన్‌ సినిమాలంటే ఇష్టమని చెప్పారు. చిన్నప్పట్నుంచి చిరంజీవి, బాలయ్యబాబులను చూసి పెరిగానని, వారిలా మాస్‌, యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమాలు చేయాలని తనకు కోరికగా ఉండేదని, ఇప్పుడు తాను అదే దారిలో వెళ్తున్నట్టు చెప్పాడు కిరణ్. 

తన ప్రతి సినిమాలో ప్యామిలీ అంతా కలిసి చూసే ఎంటర్‌టైన్‌ మెంట్‌ ఉండాలని, వ్యక్తిగతంగా తనకు అది అంటే ఇష్టమని చెప్పారు. అందుకే తాను సినిమాల ఎంపిక చేసుకునే టైమ్‌లోనే ఆ జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పారు. మొదట్లో తన సినిమాలు బాగా ఆడాలని, తాను నిలబడాలనే ఉద్దేశ్యంతో రైటింగ్స్ సైడ్‌ ఇన్‌వాల్వ్ అయ్యానని, మళ్లీ `నేను మీకు బాగా కావాల్సినవాడిని` చిత్రానికి రైటింగ్స్ సైడ్‌ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండనిపించి, అందుకే తాను ఇన్‌వాల్వ్ అయ్యానని చెప్పారు. 

ఈ సినిమాలో  ఓ నలభై నిమిషాల పాటు యాక్షన్‌ ఎపిసోడ్‌ ఉందని, అది నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందన్నారు. ఓవరాల్‌గా తనది ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌ రోల్‌ అని, ఈ చిత్రంతో ఆడియెన్స్ ని కచ్చితంగా ఆకట్టుకుంటాననే నమ్మకం ఉందన్నారు. కూతురు, తండ్రి మధ్య ఎమోషన్స్ ఈ సినిమాలో బలంగా ఉంటాయని, దాని చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు సినిమాలో మెయిన్‌ పాయింట్‌ గా ఉంటుందన్నారు. 

తన గత సినిమాలు `సెబాస్టియన్‌` పెద్దగా ఆకట్టుకోలేదని, `సమ్మతమే` కమర్షియల్‌గా హిట్ అని చెప్పారు. కానీ `నేను మీకు బాగా కావాల్సిన వాడిని` చిత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ డిజప్పాయింట్‌ చేయదని, సినిమా ఆసాంతం వినోదాత్మకంగా సాగుతుందని, ప్రతి ఒక్కరు ఎంజాయ్‌ చేసేలా ఉంటుందన్నారు. అదే సమయంలో తన సినిమాల ద్వారా ఏదో ఒక పాయింట్‌ని చెప్పాలనేది తన ఉద్దేశ్యమని, ఆ పాయింట్‌ ఇందులో కూడా ఉంటుందన్నారు.

ఈ సందర్భంగా బిగ్‌ డైరెక్టర్‌ కోడి రామకృష్ణగారి కూతురు స్థాపించిన బ్యానర్‌లో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని, మణిశర్మ గారితో కలిసి పని చేసే అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉందన్నారు. ఆయనతో పనిచేయడం ఓ డ్రీమ్‌లాంటిదన్నారు. సినిమాకి ఆయన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ పెద్ద అసెట్‌ అని చెప్పారు. ఈ సినిమా ట్రైలర్‌ని పవన్‌ కళ్యాణ్‌ విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉందని, ఆయన తన సినిమాని చూశానని చెప్పడం ఎగ్జైటింగ్‌గా ఉందన్నారు. అది ఎప్పటికీ మర్చిపోలేని ఫీలింగ్‌ అని చెప్పారు కిరణ్‌.
 
నెక్ట్స్ సినిమాల గురించి చెబుతూ, గీతా ఆర్ట్స్ లో `వినరో భాగ్యము విష్ణు కథ`, మైత్రి మూవీ మేకర్స్ లో  `మీటర్` చేస్తున్నానని, ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొన్నాయన్నారు. ఏ ఎం రత్నం బ్యానర్ లోని `రూల్స్ రంజన్` సినిమా నలభై శాతం షూటింగ్‌ పూర్తయ్యిందని, అలాగే దర్శకుడు శ్రీధర్ గాదెతో త్వరలో మరో చిత్రం చేసే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఏడాదిలోనే మరో సినిమా విడుదల కానుందని తెలిపారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్