సూసైడ్ నోట్ లో అలా రాసి యువ నటి ఆత్మహత్య!

By Sambi ReddyFirst Published Sep 18, 2022, 2:55 PM IST
Highlights

యువ నటి  దీప ఆత్మహత్య పరిశ్రమలో విషాదం నింపింది. ఒకరిని జీవితాంతం ప్రేమిస్తాను అని సూసైడ్ నోట్ లో రాయగా... పోలీసులు విచారణ చేపట్టారు. 
 

దీప అలియాస్ పౌలిన్ చాలా కాలంగా పరిశ్రమలో ఉన్నారు. ఆమె తమిళ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. సెప్టెంబర్ 17 శనివారం దీప ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని విరుగంబాక్కం ఏరియాలో గల మల్లికై అవెన్యూలో నివాసం ఉంటున్న దీప గదిలో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు దీపతో మాట్లాడాలని ఆమె మొబైల్ కి పలుమార్లు కాల్ చేశారు. అయినా దీప ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో దీప ఫ్రెండ్ ప్రభాకరన్ ఇంటికి వెళ్లి చూశారు. 

దీప గదిలో ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. దీప కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్నారు. డిప్రెషన్ కి గురైన దీప ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆమె ఆత్మహత్యకు ప్రేమ విఫలమే కారణం కావచ్చని పోలీసులు నమ్ముతున్నారు. దీప గదిలో సూసైడ్ నోట్ లభించింది. అందులో ''అతన్ని నేను జీవితాంతం ప్రేమిస్తాను. నా చావుకు ఎవరూ కారణం కాదు'' అని రాసి ఉంది. తాను ప్రేమిస్తున్న వ్యక్తి పేరును ఆమె లెటర్ లో పొందుపరచలేదు. 

దీప మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కి పంపించారు. దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా విచారణ చేపట్టారు. వెండితెరపై వెలిగిపోవాలని ఎన్నో కలలు కన్న దీప జీవితం ఇలా మధ్యలో ముగిసింది. దీప మృతికి పరిశ్రమ వర్గాలు, సన్నిహితులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 

click me!