రిలీజ్ కు రెడీ అవుతోంది సమంత శాకుంతలం సినిమా. సమంతతో పాటు డైరెక్టర్ గుణశేఖర్ కూడా ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇక రీసెంట్ గా ఈసినిమా నుంచి కింగ్ దుష్యంతుడి ఫస్ట లుక్ ను రిలీజ్ చేశారు టీమ్.
టాలీవుడ్ సీనియర్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా శాకుంతలం. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కతున్న ఈసినిమాను సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసుకుందీ మూవీ. ఇక రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవల్సి ఉండగా..త్వరలోనే ఈమూవీని థియేటర్ లోకి వదిలే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇప్పటికే ఈమూవీ నుంచి రిలీజ్ అయిన సమంత ఫస్ట్లుక్పోస్టర్కు భారీగా ప్రేక్షకుల నుండి స్పందన లభించింది.
మైథలాజికల్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈసినిమాలో మలయాళ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ మోడల్ దేవ్ మోహన్ దుష్యంతుడిగా కీలకపాత్రలో నటించాడు. తాజాగా ఈ సినిమా నుంచి దేవ్ మోహన్ కింగ్ దుష్యంతుడి పాత్రలో ఉన్న ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆదివారం దేవ్ మోహన్ బర్త్‌డే సందర్భంగా ఈయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో కనిపించనున్నాడు. గుర్రంపై యుద్ధ వీరుడిగా ఇంటన్సీవ్ లుక్స్‌తో పోస్టర్లో కనిపిస్తున్నాడు.
ఇక ఈ మూవీలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గారాల పట్టి అల్లుఅర్హ జూనియర్ శకుంతలగా.. కీలకపాత్రలో నటించింది. దిల్‌రాజు సమర్పణలో గుణ టీంవర్క్స్ బ్యానర్‌పై నీలిమాగుణ ఈ సినిమాను నిర్మిస్తుంది. భారీ బడ్జెట్ తో.. మల్టీ లాగ్వేజ్ లో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమాను నెక్ట్స్ ఇయర్ సెకండ్ మిడ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక గుణ శేఖర్ కు ఎప్పుడు మంచి మంచి ట్యూన్స్ ఇచ్చే.. మెలోడీ కింగ్ మణిశర్మ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.రుద్రమదేవీ సినిమా తరువాత గుణశేఖర్ దాదాపు ఏడేళ్ళు గ్యాప్ తీసుకుని శాకుంతలం సినిమాను తెరకెకెక్కిస్తున్నారు.