NaaSaamiRanga:నాగార్జున తెలివైనోడు కదా.. సంక్రాంతి పోటీలో గెలిచేందుకు అదే ఫార్ములా, వైరల్ వీడియో

Published : Dec 08, 2023, 11:14 AM IST
NaaSaamiRanga:నాగార్జున తెలివైనోడు కదా.. సంక్రాంతి పోటీలో గెలిచేందుకు అదే ఫార్ములా, వైరల్ వీడియో

సారాంశం

ఈ సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం, హను మాన్, వెంకటేష్ సైంధవ్ చిత్రాలు పోటీలో ఉన్నాయి. ఈ చిత్రాల నుంచి పోటీ తట్టుకునేందుకు నాగార్జున తన తెలివికి పదును పెట్టారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించే దిశగా నా సామిరంగ ప్రమోషన్స్ మొదలయ్యాయి.

కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'నా సామిరంగ'.  చాలా కాలంగా నాగార్జున నుంచి స్టైలిష్, సాఫ్ట్ చిత్రాలు మాత్రమే వస్తున్నాయి. ఎట్టకేలకు నాగార్జున తన లోపల దాగున్న మాస్ కోణాన్ని బయటకి తీసేలా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన నా సామిరంగ ఫస్ట్ లుక్ టీజర్ కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. 

ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. విజయ్ బిన్నీ దర్శకుడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. తన చిత్రానికి మార్కెటింగ్ చేయడంలో, ప్రమోషన్స్ విషయంలో నాగార్జున ప్లాన్స్ అద్భుతంగా వర్కౌట్ అవుతాయి. 

ఈ సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం, హను మాన్, వెంకటేష్ సైంధవ్ చిత్రాలు పోటీలో ఉన్నాయి. ఈ చిత్రాల నుంచి పోటీ తట్టుకునేందుకు నాగార్జున తన తెలివికి పదును పెట్టారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించే దిశగా నా సామిరంగ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ చిత్రంలో ఫస్ట్ సింగిల్ కి సంబందించిన ప్రోమో రిలీజ్ అయింది. 

ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్లా అంటూ సాగే సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో సంక్రాంతి మూడ్ కి తగ్గట్లుగా పెల్లెటూరు వాతావరణాన్ని హైలైట్ చేస్తున్నారు. హీరోయిన్ ఆషిక రంగనాథన్ అచ్చ తెలుగు అమ్మాయిలా లంగాఓణిలో మెరుస్తోంది. ఇక నాగార్జున పంచె కట్టులో కనిపిస్తున్నారు. ఇది మాస్ చిత్రం అయినప్పటికీ సోగ్గాడే చిన్ని నాయన తరహాలో రొమాంటిక్ యాంగిల్ ని నాగార్జున ప్రదర్శిస్తున్నారు. 

ఇక ఈ సాంగ్ ని యంగ్ సెన్సేషన్ రామ్ మిర్యాల అద్భుతంగా పాడారు. డిసెంబర్ 10న ఉదయం 11.35 గంటలకు పూర్తి సాంగ్ రిలీజ్ కానుంది. ఈ సాంగ్ చూస్తుంటే సంక్రాంతి పండక్కి తగ్గట్లుగా పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ