SVP: మహేష్‌ `సర్కారు వారి పాట` చిత్రంపై విజయసాయి రెడ్డి ట్వీట్‌.. హాట్‌ టాపిక్‌

Published : May 12, 2022, 04:27 PM ISTUpdated : May 12, 2022, 04:35 PM IST
SVP: మహేష్‌ `సర్కారు వారి పాట` చిత్రంపై విజయసాయి రెడ్డి ట్వీట్‌.. హాట్‌ టాపిక్‌

సారాంశం

`సర్కారు వారి పాట` చిత్రంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశంసలు కురిపించడం విశేషం. `సర్కారు వారి పాట` చిత్రాన్ని, మహేష్‌ని అభినందిస్తూ మంచి సందేశాత్మక పాయింట్‌ని అద్భుతంగా చెప్పారని కొనియాడారు.

సూపర్‌ స్టార్‌ మహేష్‌(Maheshbabu) నటించిన లేటెస్ట్ మూవీ `సర్కారు వారి పాట`(Sarkaru Vaari Paata). `గీతగోవిందం` వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత పరశురామ్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. కీర్తిసురేష్‌ కథానాయికగా నటించింది. భారీ అంచనాలతో గురువారం విడుదలైంది. సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. బ్యాంక్‌ కుంభకోణాలు, బ్యాంకులకు కార్పొరేట్ అధినేతలు వేల కోట్లు లోన్‌ ఎగ్గొట్టడాలు అనే అంశాన్ని టచ్‌ చేశారు. కానీ బలంగా దాన్ని వెండితెరపై ఆవిష్కరించలేదనే టాక్‌ ఉంది. ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా రూపొందించలేదనే టాక్‌ వినిపిస్తుంది. 

ఇదిలా ఉంటే ఈ చిత్రంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijay Sai Reddy)ప్రశంసలు కురిపించడం విశేషం. `సర్కారు వారి పాట` చిత్రాన్ని, మహేష్‌ని అభినందిస్తూ మంచి పాయింట్‌ని అద్భుతంగా చెప్పారని కొనియాడారు. `సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట` బాగుంది. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు` అని పేర్కొన్నారు విజయ సాయిరెడ్డి. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ చేయడం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

మహేష్‌బాబు ఇటీవల థియేటర్ల టికెట్ల ధరల కోసం ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని కలిశారు. ప్రభాస్‌, చిరంజీవి, రామజౌళి, కొరటాల శివ వంటి వారు సీఎంని కలిసిన వారిలో ఉన్నారు. ఈనేపథ్యం తక్కువగా ఉన్న టికెట్ రేట్లని పెంచుకునే వెసులుబాటు కల్పించారు. ఈ సందర్భంగా మహేష్‌ జగన్‌పై ప్రశంసలు కురిపించారు. మరోవైపు `సర్కారు వారి పాట` చిత్రంలో జగన్‌ డైలాగ్‌ `నేను విన్నాను, నేను ఉన్నాను` అనే డైలాగ్‌ని పెంచారు. ఇది వైసీపీ వ్యతిరేకంగా సెటైర్లు పేల్చేలా ఉందన్నారు. 

కానీ ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో జగన్‌పై ప్రశంసలు కురిపించారు మహేష్‌. `ఆంధ్రప్రదేశ్‌ `ముఖ్యమంత్రి వైఎప్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నేరుగా కలిసినప్పుడు సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఆయనతో అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడాను అంతేకానీ నేరుగా కలవలేదు. కానీ ఆ మధ్య కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన చాలా సింపుల్. అంత సింపుల్‌గా ఉంటారా? అని నేరుగా  కలిసినప్పుడు అనిపించింది ` అని చెప్పారు. ఇప్పుడు ఏకంగా విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేస్తూ ప్రశంసలు కురిపించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి