Kangana Ranaut: ఆ పుకార్లు కారణంగానే నన్నెవరు పెళ్లి చేసుకోవడం లేదు! 

Published : May 12, 2022, 03:11 PM IST
Kangana Ranaut: ఆ పుకార్లు కారణంగానే నన్నెవరు పెళ్లి చేసుకోవడం లేదు! 

సారాంశం

ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ విషయం ఏదైనా కుండబద్దలు కొడుతుంది. కాగా ఆమె తన వివాహం పై సంచలన కామెంట్స్ చేసింది. 

కంగనా అంటే కేర్ ఆఫ్ వివాదాలు. బాలీవుడ్ పెద్దలను విమర్శిస్తూ ఆమె చేసే కామెంట్స్  హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. బాలీవుడ్ లోని నెపోటిజాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తారు. పరిశ్రమను శాసించే దర్శక నిర్మాతలు, స్టార్స్ తో గొడవలు పెట్టుకొని కూడా కంగనా (Kangana Ranaut)అక్కడ రాణిస్తున్నారు. ఇక హీరో హృతిక్ రోషన్ పై లైంగిక ఆరోపణలు చేయడంతో న్యాయపోరాటానికి కూడా దిగారు. మహారాష్ట్ర గవర్నమెంట్ తో కూడా అమీ తుమీకి దిగింది కంగనా. ఇలా చెప్పుకుంటూ పోతే కంగనా జీవితంలో లెక్కలేనన్ని వివాదాలు. 

మరి ఇలాంటి నటి గురించి ఎవరికైనా ఎలాంటి అభిప్రాయం ఉంటుంది? కంగనా గయ్యాళి ఆమెతో పెట్టుకుంటే డేంజర్ అనుకుంటారు. ఇదే అనుమానం లేటెస్ట్ ఇంటర్వ్యూలో యాంకర్ వ్యక్తపరిచారు. మీరు వ్యక్తిగతంగా కూడా టామ్ బాయ్ లా ఉంటారా? అందరితో గొడవ పడతారా? అని అడుగగా... కంగనా ఖండించారు. నాకు గురించి అందరూ ఇలాంటి రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు. దాని వలన నాకు పెళ్లి కూడా కావడం లేదు. నేను ఇప్పటి వరకు ఎవరినైనా కొట్టానా అంటూ.. ఒకింత వ్యగ్యంగా స్పందించారు. 

కంగనా లేటెస్ట్ మూవీ ధాకడ్ (Dhaakad)మే 20న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆమె చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ధాకడ్ మూవీలో కంగనా ఏజెంట్ అగ్ని రోల్ చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అర్జున్ రామ్ పాల్, దివ్య దత్ ఇతర కీలక రోల్స్ చేస్తున్నారు. తలైవి మూవీ తర్వాత కంగనా చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ధాకడ్ విశేషం. 

మరోవైపు ఇటీవల కంగనా హోస్ట్ గా వ్యవహరించిన లాక్ అప్ రియాలిటీ షో ముగిసింది. కమెడియన్ మునావర్ ఫారోహి షో విన్నర్ గా టైటిల్ దక్కించుకున్నాడు. ఓటిటిలో ప్రసారమైన లాక్ అప్ షో బోల్డ్ కంటెంట్ తో ఆసక్తికరంగా సాగింది. నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించిన ఈ షోకి బాగానే ఆదరణ దక్కింది. ఆల్ట్ బాలాజీ, ఎంఎక్స్ ప్లేయర్స్ లో ఈ షో ప్రసారమైంది.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా