‘డబ్బులు కూడా ఇస్తా.. ఫేక్ న్యూస్ ఆపేయండి’.. ‘యశోద’ నటుడు ముకుందన్ ఫైర్

By Nuthi Srikanth  |  First Published Feb 13, 2024, 10:35 PM IST

సమంత ‘యశోద’లో కీలక పాత్ర పోషించిన మలయాళ నటుడు ముకుందన్ పై ఓ రూమర్ క్రియేట్ అయ్యింది. దానిపై ఆయన తాజాగా స్పందించారు. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నందుకు మండిపడ్డారు. 


మలయాళ నటుడు ముకుందన్ (Mukundan) తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మలయాళం చిత్రాలతో పాటు టాలీవుడ్ లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు. తెలుగులో ఇప్పటికే కీలక పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నారు. ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’, చివరిగా సమంత నటించిన ‘యశోద’ చిత్రంలో కీలక పాత్రతో అలరించారు. 

 తెలుగు తో పాటు తమిళంలోనూ ఆయా  చిత్రాల్లో నటిస్తూనే వస్తున్నారు. తన నటనతో ప్రేక్షకులను ఇట్టే మయా చేస్తున్న ముకుందన్ గురించి ఓ రూమర్ క్రియేట్ అయ్యింది. సోషల్ మీడియా ప్రపంచంలో సెలబ్రెటీల గురించి రోజుకో పుకారు వస్తుండటం సహజంగా మారుతోంది. రూమర్లనూ కొట్టిపారేయడానికి కూడా లేదు...  బజ్ వచ్చిన చాలా విషయాలు నిజమైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. 

Latest Videos

ఈ క్రమంలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అది కూడా హీరోయిన్ అనుశ్రీ (Anusree)ని వివాహాం చేసుకుంటున్నారంటూ రూమర్ స్ప్రెడ్ అయ్యింది. ఓ ఈవెంట్ లో ఇద్దరు కలిసి కనిపించడంతో ఈ రూమర్లు ప్రారంభమయ్యాయి. విషయం తెలుసుకున్న ఉన్ని ముకుందన్ ఖండించారు. ‘ఇలాంటి ఫేక్ న్యూస్ ను ఆపేయండి... అందుకు మీకు ఎంత డబ్బివ్వాలి కూడా చెప్పండి’ అంటూ రియాక్ట్ అయ్యారు. దీంతో ఆ రూమర్లకు అడ్డుకట్ట పడింది. 

 

click me!