బిగ్ బాస్ తెలుగు 8లో నామినేషన్ల ప్రక్రియ చాలా చప్పగా సాగింది. కానీ మరోసారి మణికంఠని యష్మి టార్గెట్ చేసింది. తనకు తెలియకుండానే తన వెనకాల గోతిని తవ్వుకుంటుంది.
బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ నాలుగు వారాలు పూర్తి చేసుకున్నాయి. అందుకు కోరుకున్నట్టుగానే నాల్గో వారం సోనియా ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ హౌజ్‌లో ఆమెని నాగుపాముగా వర్ణించిన నెటిజన్లు, ఆమెని ఎలిమినేట్ చేసేంత వరకు నిద్ర పోలేదని చెప్పాలి. ఆమెకి వ్యతిరేకంగా భారీ స్థాయిలో క్యాంపెయిన్ జరిగింది. ఇందులో నిఖిల్ ఫ్యాన్సే ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సోనియా మాయలో పడి నిఖిల్ ఆట బాగా ఆడటం లేదనే కామెంట్స్ వచ్చాయి. నిఖిల్‌ని, పృథ్వీని తన కంట్రోల్‌లో పెట్టుకుని వారిని చెడగొడుతుందనే ట్రోలింగ్ నడిచింది. మొత్తంగా సోనియా బిగ్ బాస్‌ని వీడింది.
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
undefined
ఇక సోనియా ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ హౌజ్‌లో సమీకరణలు మారాయి. యష్మి.. రంగంలోకి దిగుతుంది. నిఖిల్‌కి బ్రెయిన్ వాష్ చేస్తుంది. గేమ్ ఆడాలని, మనుషులు ముఖ్యం కాదని చెబుతుంది. అంతేకాదు వారికి యష్మి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. తను లీడ్ తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక సోమవారం (29వ) రోజు ఐదో వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ జరిగింది. నాలుగు వారాలు చాలా వాడి వేడిగా నామినేషన్ల ప్రక్రియ జరిగింది. కానీ ఐదో వారం మాత్రం ఆ వేడి కనిపించడం లేదు. పైగా నామినేట్ చేసేటప్పుడు ఆ కంటెస్టెంట్ ఫోటోలు మంటలో వేయాల్సింది. అందులో మంటలు ఉన్నాయి, కానీ కంటెస్టెంట్లు వాదనలో అంతటి ఫైర్ కనిపించలేదు. దీంతో ఐదో వారం నామినేషన్ల ప్రక్రియ చాలా చప్పగా సాగింది.
ఇందులో ఎప్పటికీ యష్మి తనదైన స్టయిల్‌లో మణికంఠపై ఫైర్ అయ్యింది. అదే యాటిట్యూడ్ చూపించింది. మణికంఠని కక్ష్యపూరితంగానే నామినేట్ చేసింది. మొదట మణికంఠ.. యష్మిని నామినేట్ చేశాడు. ఆమె తనని మగాడు కాదనే పెద్ద మాట అనడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇక యష్మి వంతు వచ్చినప్పుడు శక్తి క్లాన్ నుంచి తాను తప్పుకోవడానికి సంబంధించిన విషయం బయటపెడుతూ నామినేట్ చేసింది యష్మి. నువ్వు తన హార్ట్ ని బ్రోక్ చేశావని, ఫ్రెండ్‌షిప్ ని బ్రేక్ చేశావని తెలిపింది. రివేంజ్ తరహాలో ఆమె మణికంఠని నామినేట్ చేసింది. దీనికి రీవేంజ్ తీసుకోవడం ఏంటంటూ మణికంఠ ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కాస్త గట్టిగానే వాగ్వాదం జరిగింది. కాస్త వీరిద్దరి నామినేషనే హీటెక్కించింది.
అలాగే పృథ్వీసైతం మణికంఠని నామినేట్ చేశాడు. మణికంఠ రియాలిటీగా ఉండటం లేదని, రెండు రకాలుగా మాట్లాడుతున్నాడని మాట మీద నిలబడటం లేదని, క్లారిటీ ఉండటం లేదని ఆరోపిస్తూ నామినేట్ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ గట్టిగానే జరిగింది. ఏం చేస్తావ్ అనే దాకా వెళ్లింది. యాటిట్యూడ్ అని మణికంఠ కామెంట్ చేశాడు. దానికి పృథ్వీ కూడా అలానే రియాక్ట్ కావడంతో హీటెక్కింది. చూడబోతుంటే అటు యష్మి, ఇటు పృథ్వీ.. మణికంఠకి హైప్ ఇస్తున్నారు. ఆయన్ని హీరో చేస్తున్నారు. ప్రతి సారి అతన్నే టార్గెట్ చేస్తూ వాళ్లు జీరో అవుతున్నారు. మణికంఠని హీరోని చేస్తున్నారు. వీరి టార్గెటే అతనికి సింపతిగా మారుతుంది. అది ఆడియెన్స్ సపోర్ట్ గా మారుతుంది. ఇలా ఈ ఇద్దరే కాదు, మణికంఠని టార్గెట్ చేసిన వాళ్లంతా పరోక్షంగా అతన్ని స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారుస్తున్నారు. తమ తెలియకుండానే వెనకాల గోతులు తవ్వుకుంటున్నారని నెటిజన్లు కామెంట్లు చేయడం విశేషం.
ఆ తర్వాత ఆదిత్య, ప్రేరణ విషయంలోనూ గరం గరంగా సాగింది. ప్రేరణ.. ఆదిత్యని నామినేట్ చేసింది. ఆయన యాటిట్యూడ్‌పై అభ్యంతరం తెలిపింది. పాజిటివ్ నేచర్‌ని సరికాదని, షుగర్ కోట్ వేస్తున్నావని, కాన్ఫిడెన్స్ గా ఉండటం లేదని తెలిపింది. దాన్ని కాసేపు వాదించిన ఆదిత్య ఓం, తన కాన్ఫిడెన్స్ గురించి చెబుతూ, వచ్చి మంటల్లో తన ఫోటోని తీసి బయట వేశాడు. దీంతో బిగ్ బాస్ ఫైర్ అయ్యాడు. ఆటల్లా ఉందా? అంటూ ఎవరూ ఇలాంటి పిచ్చిపనులు చేయోద్దని మండిపడ్డాడు బిగ్ బాస్. ఇదిలా ఉంటే సోనియా ఎలిమినేట్ కావడంతో హాయిగా ఉందని రాత్రి విష్ణు ప్రియా కామెంట్ చేయడం విశేషం. మనసు ఫ్రీగా ఉందని, ఆమె వెళ్లిపోవడంతో ఏదో బరువు తగ్గిపోయినట్టుగా ఉందని తెలిపింది. తాను కూడా పృథ్వీరాజ్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమెకి ఆ అడ్డంకులు లేవనే కోణంలో ఈ కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇక నామినేషన్ల ప్రక్రియలో మణికంఠ.. యష్మి, నైనికని, నైనిక.. విష్ణు ప్రియా, నబీల్‌ని, సీత.. మణికంఠ, విష్ణు ప్రియాలను, నబీల్.. విష్ణు ప్రియా నైనికలను, ఆదిత్యం ఓం.. నైనిక, విష్ణు ప్రియాలను, నిఖిల్.. విష్ణు ప్రియా, మణికంఠ, ప్రేరణ.. మణికంఠ, ఆదిత్య ఓం, విష్ణు ప్రియా.. నైనిక, నబీల్, యష్మి.. మణికంఠ, ఆదిత్యని, పృథ్వీరాజ్.. నైనిక, మణికంఠలను నామినేట్ చేశారు. మణికంఠ, నైనిక, విష్ణు ప్రియాలకు ఎక్కువగా నామినేషన్లు పడ్డాయి. మొత్తంగా ఐదో వారం మణికంఠ, నైనిక, విష్ణు ప్రియా, ఆదిత్యం ఓం, నిఖిల్ నామినేట్ అయ్యారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడాలి. అయితే ఈ వారం మధ్యలోనే ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అది ఎవరనేది తెలియాల్సి ఉంది.