ప్రభాస్‌ని సెట్‌లో ఏడిపించిన అనుష్క, ఏమని పిలుస్తుందో తెలుసా? పాపం డార్లింగ్‌ తలెత్తుకోలేని పరిస్థితి!

By Aithagoni Raju  |  First Published Sep 30, 2024, 11:07 PM IST

డార్లింగ్‌ ప్రభాస్‌, అనుష్క శెట్టిల మధ్య లవ్‌ స్టోరీ నడుస్తుందనేది అందరు చెప్పిన మాట. ఇప్పటికీ ఇదొక మిస్టరీనే. కానీ స్వీటి ప్రభాస్‌ని ఏడిపించేదట. ఆ కథేంటో చూద్దాం. 
 


ప్రభాస్‌, అనుష్క శెట్టి కలిసి నాలుగు సినిమాలు చేశారు. `బిల్లా` సినిమాతో వీరి జర్నీ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. ఓ వైపు గర్ల్ ఫ్రెండ్‌గా, నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో మెరిసింది అనుష్క. ఈ సినిమా యావరేజ్‌గానే ఆడింది. కానీ ఆ తర్వాత వచ్చిన `మిర్చి` మూవీ మాత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో ఈ జంటని చూశాక అంతా సరైన జోడీగా అభివర్ణించారు. హైట్‌ పర్సనాలిటీ ఇద్దరివీ ఓకేలా ఉండటంలో బెస్ట్ పెయిర్‌గా పిలిచేవారు. పైగా ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉండటంలో అనేక పుకార్లు స్టార్ట్ అయ్యాయి. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ప్రభాస్‌, అనుష్క శెట్టిల పెళ్లి రూమర్లు.. 

Latest Videos

ప్రభాస్‌, అనుష్క వరుసగా నాలుగు సినిమాలు చేయడంతో ఈ ఇద్దరి మధ్య లవ్‌ స్టోరీ నడుస్తుందనే రూమర్లు ప్రారంభమయ్యాయి. క్లోజ్‌గా ఉండే ఫోటోలు రావడం కూడా దీనికి ఊతమిచ్చాయి. పుకార్లకి బలాన్ని చేకూర్చాయి. ప్రభాస్‌ అనుష్క గురించి చెప్పాల్సి వస్తే ఆమెని ఆకాశానికి ఎత్తేవాడు. తనకు బెస్ట్ కోస్టార్‌ అని అనేక సార్లు చెప్పాడు. ఆమె అందం గురించి చాలా సార్లు మాట్లాడారు. ఇవన్నీ కారణాలతో ఈ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారనే చర్చ మొదలైంది. పైగా దీనిపై ఇద్దరి నుంచి క్లారిటీ రాలేదు. స్పష్టంగా ఖండించలేకపోయారు. అందుకే ఆ రూమర్లు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. 

ప్రభాస్‌, అనుష్క ఓల్డ్ వీడియో వైరల్‌..

ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని చాలా సార్లు వార్తలు వచ్చాయి. అదిగో పెళ్లి, ఇదిగో పెళ్లి అంటూ రచ్చ నడుస్తూనే ఉంది. సోషల్‌ మీడియా విస్తరించాక ఈ రూమర్లు మరింతగా మారుతూ వచ్చాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఆ రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ ఇద్దరు ప్రభాస్‌, అనుష్క ఎవరికి వాళ్లు తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇవేవీ లెక్కచేయకుండా తమ పనుల్లో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ప్రభాస్‌, అనుష్కల పాత కన్వర్జేషన్‌ వైరల్‌ అవుతుంది. ప్రభాస్‌ని అనుష్క ఏడిపించడం ఇందులో హైలైట్‌ పాయింట్‌గా నిలుస్తుంది. మరి ఆ కథేంటో చూస్తే, 

`బాహుబలి` సెట్‌లో ప్రభాస్‌ని ఆటపట్టించిన అనుష్క..

ప్రభాస్‌, అనుష్క జంటగా, లవ్‌ ఇంట్రెస్ట్ గా సినిమాలు చేశారు. ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్ చేశారు. అద్భుతమైన కెమిస్ట్రీని పండించి ఆకట్టుకున్నారు. అందుకే వీరిని బెస్ట్ జోడీ అంటుంటారు. సెట్‌లో మాత్రం అనుష్క.. ప్రభాస్‌ని ఏడిపిస్తుందట. అందరి ముందు టీజింగ్‌ చేస్తుందట. డార్లింగ్‌ తలెత్తుకోలేని పరిస్థితి చోటుచేసుకుంటుందట. ప్రభాస్‌ని అనుష్క.. మా బాబు ఎక్కడ అని పిలవడమే దానికి కారణం. లవర్‌గా చెలామణి అవుతున్న ప్రభాస్‌ని అనుష్క కొడుకు అని పిలవడమేంటి? అనేది ఆశ్చర్యంగా మారింది. అందులో ఓ లాజిక్‌ ఉంది. అదే ఇక్కడ హైలైట్‌ పాయింట్‌. 

ప్రభాస్‌ని కొడుకుగా పిలిచిన అనుష్క..

అనుష్క, ప్రభాస్‌ అన్ని సినిమాల్లోనూ జోడీగా నటించారు. కానీ `బాహుబలి`లో మాత్రం జోడీతోపాటు అమ్మా కొడుకులుగానూ నటించారు. మొదట మహీష్మతి సామ్రజ్యానికి యువరాజుగా అమరేంద్ర బాహుబలి పాత్రలో కనిపిస్తాడు ప్రభాస్‌. ఆయనకు ప్రేమించి తన వశం చేసుకున్న దేవసేనగా అనుష్క నటించింది. అయితే వీరిద్దరికి కొడుకు పుడతాడు. మహేంద్ర బాహుబలి. ఇలా రెండో పాత్రలో అనుష్కకి కొడుకుగా కనిపిస్తాడు ప్రభాస్‌. దీన్ని పట్టుకుని అనుష్క సెట్‌లో డార్లింగ్‌ని ఆటపట్టించేదట. ప్రభాస్ కనిపించకపోతే నా కొడుకు ఎక్కడ అంటూ పిలిచేదట. అందరి ముందు అలా చేసేదట. దీంతో డార్లింగ్‌ షేమ్‌గా ఫీలయ్యేవాడట. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. ప్రభాస్‌ తనని ఏడిపించడు అని, కానీ తానే ఆయన్ని కొడుకు ఎక్కడ నా కొడుకు ఎక్కడ అని ఏడిపించేదాన్ని అని తెలిపింది అనుష్క. `బాహుబలి` సినిమా విడుదల సమయంలో ఇచ్చిన ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పుడిది వైరల్‌ అవుతుంది. 

బిజినెస్‌ మేన్‌తో అనుష్క వివాహం?..

ఇదిలా ఉంటే అనుష్క పెళ్లికి సిద్ధమయ్యిందని తెలుస్తుంది. ఓ వ్యాపారవేత్తని మ్యారేజ్‌ చేసుకోబోతుందట. ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య చర్చలు కూడా జరిగాయని, పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇది కూడా రెగ్యూలర్‌గా రూమరేనా? లేక ఇందులో నిజం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అనుష్క.. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `ఘాటి` సినిమాలో నటిస్తుంది. మరోవైపు ప్రభాస్‌.. మారుతి దర్శకత్వంలో `ది రాజా సాబ్‌` చేస్తున్నాడు. హర్రర్ కామెడీగా ఇది రూపొందుతుంది. అలాగే హనురాఘవ పూడి మూవీ చేస్తున్నారు. `దీనికి `పౌజీ`అనే టైటిల్‌ వినిపిస్తుంది. వీటితోపాటు సందీప్‌ రెడ్డి వంగాతో `స్పిరిట్‌` సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అంతేకాదు `సలార్‌ 2`, `కల్కి 2` కూడా రూపొందాల్చింది. 
 

click me!