Ramayana Movie: ముల్లోకాలకు అధిపతి రావణుడు.. రామాయణ నుంచి యశ్ పోస్టర్ వైరల్

Published : Sep 27, 2026, 08:45 PM IST
Yash Ravana Character Poster Released

సారాంశం

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్‌లో వస్తున్న 'రామాయణ' సినిమాలో రావణుడిగా నటిస్తున్న యశ్ కొత్త పోస్టర్ రిలీజైంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమా దీపావళికి థియేటర్లలోకి రానుంది.

రామాయణ నుంచి కొత్త పోస్టర్

ఇండియన్ సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రామాయణ' సినిమా నుంచి కొత్త క్యారెక్టర్ పోస్టర్ వచ్చేసింది. ఇందులో యశ్ రావణుడి గెటప్‌లో అదరగొడుతున్నాడు. 'ముల్లోకాలకు (స్వర్గం, భూమి, పాతాళం) అధిపతి అయిన రావణుడు' అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. యశ్ కెరీర్‌లోనే ఇది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుతుందని రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి మెయిన్ లీడ్స్‌గా నటిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా థియేటర్లలోకి రాబోతోంది.

రావణుడి పాత్రలో యశ్

నితీష్ తివారీ ఈ 'రామాయణ' చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇక సన్నీ డియోల్ హనుమంతుడిగా, మలయాళ సీనియర్ నటి శోభన కైకేయిగా నటిస్తున్నారు. ఒకప్పుడు దూరదర్శన్‌లో వచ్చిన రామాయణంలో శ్రీరాముడిగా మెప్పించిన అరుణ్ గోవిల్.. ఈ సినిమాలో దశరథ మహారాజుగా కనిపించనున్నారు. రవి దూబే లక్ష్మణుడిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా, అజింక్య డియో విశ్వామిత్ర మహర్షిగా, కునాల్ కపూర్ ఇంద్రుడిగా నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

అతిపెద్ద మ్యూజిక్ రైట్స్ డీల్

ఆస్కార్ విన్నర్స్ హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ కలిసి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండటం మరో విశేషం. ఇదిలా ఉంటే, రామాయణ మ్యూజిక్ రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడుపోయాయి. ప్రముఖ ఆడియో కంపెనీ టీ-సిరీస్ ఈ హక్కులను దక్కించుకుంది. ఏకంగా రూ.75 కోట్ల అడ్వాన్స్ డీల్ కుదిరిందని, ఇండియన్ సినిమాలో ఇదే అతిపెద్ద మ్యూజిక్ రైట్స్ డీల్ అని ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా వెల్లడించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thriller Movies: ఒళ్లు గగుర్పొడిచే 5 థ్రిల్లర్ సినిమాలు.. క్లైమాక్స్ వరకు సస్పెన్స్ గ్యారెంటీ, ఎక్కడ చూడాలంటే?
Sai Pallavi: ఆ టాటూ చూశారా? ట్రెండ్ అవుతున్న సాయి పల్లవి కొత్త లుక్.. జుట్టు కత్తిరించేసిందా?