Love and War: లవ్ అండ్ వార్ లో స్టైలిష్ గా రణ్‌బీర్ కపూర్, ఫస్ట్ లుక్ అదిరింది.. కానీ ట్విస్ట్

Published : Sep 24, 2026, 09:26 PM IST
Ranbir Kapoor

సారాంశం

రణ్‌బీర్ కపూర్ లవ్ అండ్ వార్ ఫస్ట్ లుక్‌లో సరికొత్త అవతార్‌లో ఆకట్టుకున్నారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 జనవరి 21న విడుదల కానుంది.

లవ్ అండ్ వార్ ఫస్ట్ లుక్‌

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ & వార్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ వంటి ముగ్గురు స్టార్ హీరోహీరోయిన్లు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రణ్‌బీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రణ్‌బీర్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. సంజయ్ లీలా భన్సాలీ సినిమాల్లో కనిపించే గ్రాండ్ విజువల్స్, రిచ్‌నెస్ ఈ పోస్టర్‌లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. రణ్‌బీర్ ఇప్పటివరకు కనిపించని కొత్త అవతార్‌లో కనిపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. రణ్‌బీర్ స్టైలిష్ గా ఉన్నప్పటికీ అతడి చేతికి ఉన్న రక్తం ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ లాగా ఉంది. కానీ భన్సాలీ సినిమాల్లో ఇలాంటి ఊహించని ట్విస్ట్ లు, ఇంటెన్స్ ఎపిసోడ్స్ సహజమే.

ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన మేకర్స్ “వోహ్ రుత్బా, వోహ్ రౌబ్, వోహ్ జునూన్!” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ‘లవ్ & వార్’ చిత్రం 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

George Krish: 12న వెంకటేష్, 13న చిరంజీవి.. అయినా తగ్గేదే లేదమ్మా, శర్వా ఫిక్స్ అయ్యాడు
Movie Copied Scenes: బ్లాక్ బస్టర్ సినిమాల్లో అదిరిపోయే సీన్లు..మొత్తం కాపీ చేసినవే, ఎక్కడ నుంచి లేపేశారంటే