Premane Oorilo: గాంధీ జయంతికి `ప్రేమనే ఊరిలో`.. ఏకంగా ఏడు సినిమాలతో పోటీ.. అక్కడ హిట్‌, మరి ఇక్కడ

Published : Sep 27, 2026, 04:23 PM IST
Premane Oorilo movie

సారాంశం

Premane Oorilo: గాంధీ జయంతి స్పెషల్‌గా చాలా సినిమాలు పోటీపడుతున్నాయి. ఏకంగా ఏడు సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. ఇందులో ప్రేమనే ఊరిలో మూవీ ప్రముఖంగా నిలుస్తోంది. ఈ చిత్రంలో కన్నడలో పెద్ద హిట్‌, దీంతో తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు.

విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ప్రేమనే ఊరిలో

వచ్చే వారం చిన్న సినిమాల పండగ రాబోతుంది. పెద్ద చిత్రాలు లేకపోవడంతో వరుసగా తక్కువ బడ్జెట్‌ చిత్రాలు పోటీ పడుతున్నాయి. బాక్సాఫీసు వద్ద తాడో పేడో తేల్చుకునేందుకు వస్తున్నాయి. అందులో భాగంగా వస్తున్న చిత్రాల్లో `ప్రేమనే ఊరిలో` మూవీ ప్రముఖంగా చెప్పొచ్చు. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో మంచి ప్రేమ, ఫ్యామిలీ అంశాలను ప్రధానంగా చేసుకొని ఈ చిత్రం తెరకెక్కింది.

ప్రేమనే ఊరిలో మూవీ టీమ్‌ ఇదే 

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా `ప్రేమనే ఊరిలో` చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. KGF, కాంతారా వంటి చిత్రాలకు డైలాగ్స్ అందించిన హనుమాన్ చౌదరి ఈ చిత్రానికి సంభాషణలు రాయగా ప్రముఖ గేయ రచయిత రాంబాబు గోసాల పాటలను రచించారు. సునద్ గౌతమ్ సంగీతం అందిస్తుండగా, రాజ్‌కాంత్ ఎస్.కె సినిమాటోగ్రఫీ, హర్షిత్ ప్రభు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

అక్టోబర్‌ 2న ప్రేమనే ఊరిలో రిలీజ్‌

సెప్టెంబర్ 25న కన్నడలో విడుదలైన ఈ చిత్రానికి అనూహ్య స్పందన లభించగా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన తెలుగులో విడుదలకు సిద్ధమవుతుంది. కర్ణాటకలో హౌస్ ఫుల్ అవుతున్న ఈ ప్రేమ కథ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా అదేవిధంగా ఆదరిస్తారని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు, టీజర్ ఇంకా ట్రైలర్ అద్భుత స్పందన రావడంతో మేకర్స్ ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని అంటున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Sridevi: చిరంజీవికి చుక్కలు చూపించిన శ్రీదేవి.. హీరోయిన్ కండీషన్స్ కు మెగాస్టార్ కూడా తగ్గక తప్పలేదుగా..
Comedian Remuneration: గంటకు లక్ష రూపాయలు, స్టార్‌ హీరోలకు సమానంగా పారితోషికం తీసుకున్న కమెడియన్‌ ఎవరో తెలుసా?