KGF Chapter 2 :అరాచకం ...'భీమ్లానాయక్' నే దాటేసిందే

Surya Prakash   | Asianet News
Published : Mar 29, 2022, 03:37 PM ISTUpdated : Mar 29, 2022, 04:02 PM IST
KGF Chapter 2 :అరాచకం ...'భీమ్లానాయక్' నే దాటేసిందే

సారాంశం

 ఈ చిత్రం బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. ట్రైలర్ లాగే బిజినెస్  కూడా మరో ప్రభంజనానికి శ్రీకారం చుట్టుతోంది.   కేజీఎప్ 2 బిజినెస్ దుమ్ములేపుతోంది. ప్రీ రిలీజ్ బిజెనెస్ కోట్లలో ఉంది.  ఆ లెక్కలు వింటూలో ట్రేడ్ లో మతిపోతోంది..అరాచకం అంటున్నారు. అయితే ఎంతో కొంత రిస్క్ ఉందంటున్నారు.

 కేజీఎఫ్‌ సీక్వెల్‌ కోసం సినీ ప్రేమికులు ఎంతలా ఎదురు చూస్తున్నారో  ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. మొదటి భాగం ఊహించని విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ సీక్వెల్‌పై పడింది. దీంతో భారీగా పెరిగిన అంచనాలను అందుకునే క్రమంలో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాపై మరింత జాగ్రత్త తీసుకుని ముందుకు వెళ్తున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్న కేజీఎఫ్‌2లో అన్ని భాషలకు చెందిన నటీనటులు ఉండేలా చూసుకుంటున్నారు.  వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.  అయితే  పరిస్దితులు కాస్త చక్కబడటంతో ఏప్రిల్‌ 14న సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.

సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ వేగాన్ని పెంచే పనిలో పడ్డారు. తుఫాన్ అనే పాటతో మరోసారి నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాడు రాకీ భాయ్. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. ట్రైలర్ లాగే బిజినెస్  కూడా మరో ప్రభంజనానికి శ్రీకారం చుట్టుతోంది.   కేజీఎప్ 2 బిజినెస్ దుమ్ములేపుతోంది. ప్రీ రిలీజ్ బిజెనెస్ కోట్లలో ఉంది.  ఆ లెక్కలు వింటూలో ట్రేడ్ లో మతిపోతోంది..అరాచకం అంటున్నారు. అయితే ఎంతో కొంత రిస్క్ ఉందంటున్నారు. ఆ వివరాలు చూస్తే...

ఈస్ట్ గోదావరి థియేట్రికల్ రైట్స్ 7 కోట్లకు , ఉత్తరాంధ్ర రైట్స్ 10కోట్లకు బిజినెస్ చేసింది. దీంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ బిజినెస్ తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఈస్ట్ గోదావరి భీమ్లా ప్రీ రిలీజ్ బిజినెస్ 6.4 కోట్లు చేసింది. మరోవైపు ఉత్తరాంధ్రలో రూ.9.2 కోట్ల వ్యాపారం జరిగింది. రెండు చిత్రాలకు పెద్ద సంభందం  లేకపోయినా భీమ్లా బిజినెస్ కంటే కేజీఎఫ్ 2 బిజినెస్ ఎక్కువనే చెప్పాల్సి వస్తుంది.  
 
ఇక  కేజీఎఫ్ 2  చిత్రంలో రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, శ్రీనిధి శెట్టి తదితరులు నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిలింస్ నిర్మించింది. కేజీఎఫ్ కి స్వరాలు సమకూర్చిన రవి బస్రూర్ ఈ సీక్వెల్ కి కూడా ఆయనే సంగీతం అందిస్తున్నారు. కేజీఎఫ్ 2ని దేశంలోని 6 వేల స్క్రీన్‌లలో విడుదల చేయాలని చూస్తోంది చిత్ర యూనిట్. అదే రోజు విజయ్ నటించిన మృగం కూడా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని కూడా హోంబలే ఫిల్మ్స్ వారే నిర్మించడం విశేషం.

 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..