Naveen Polishetty:వాయిస్ ఓవర్ ఇస్తున్న జాతిరత్నం

Surya Prakash   | Asianet News
Published : Mar 29, 2022, 03:09 PM IST
Naveen Polishetty:వాయిస్ ఓవర్ ఇస్తున్న జాతిరత్నం

సారాంశం

ఈ చిత్రం హై ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తోపాటు కొన్ని ఊహించ‌ని ట్విస్ట్‌లు,  క‌థ‌నంలో వ‌చ్చే మ‌లుపులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలువ‌నున్నాయి.  కథనానికి మరింత ప్రత్యేకతను జోడించడానికి, నవీన్ పోలిశెట్టి ఈ చిత్రానికి తన వాయిస్‌ఓవర్ ఇవ్వడం ఖచ్చితంగా అదనపు బోనస్ అవుతుంది అని చెప్తున్నారు.


 ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’, ‘చిచ్చోరే’ (హిందీ) సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పొలిశెట్టి. ఆయన అభిమానులు అతని సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ లోగా వాయిస్ ఓవర్ తో నవీన్  పలకరించబోతున్నారు. తాప్సీ ప్రధాన పాత్రలో కనిపించనున్న  `మిషన్ ఇంపాజిబుల్` చిత్రానికి నవీన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.

ఈ చిత్రంలో  హై ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తోపాటు కొన్ని ఊహించ‌ని ట్విస్ట్‌లు,  క‌థ‌నంలో వ‌చ్చే మ‌లుపులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలువ‌నున్నాయి.  కథనానికి మరింత ప్రత్యేకతను జోడించడానికి, నవీన్ పోలిశెట్టి ఈ చిత్రానికి తన వాయిస్‌ఓవర్ ఇవ్వడం ఖచ్చితంగా అదనపు బోనస్ అవుతుంది అని చెప్తున్నారు.

దావూద్‌ ఇబ్రహీం అనే వ్యక్తిని పట్టుకోవాలనుకునే క్రమంలో ముగ్గురు పిల్లలు, ఓ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ చేసిన సాహసం ఏంటి? అనే కథాంశంతో రూపొందిన సినిమా ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’. ఆర్‌ఎస్‌జే స్వరూప్‌ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. ఎన్‌ఎం పాషా నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 1న విడుదల కానుంది.

‘‘మా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇటీవల మహేశ్‌బాబుగారు విడుదల చేసిన మా సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు ఆర్‌ఎస్‌జే స్వరూప్‌ ఈ కథ రాసుకున్నారు. దావూద్‌ ఇబ్రహీం అనే వ్యక్తిని పట్టుకోవడానికి ముగ్గురు పిల్లలు ఎలా ప్లాన్‌ చేశారు? వీరికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఈ పిల్లలకు, ఓ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టుకు ఉన్న సంబంధం ఏంటి? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

మరో ప్రక్క నవీన్ హీరోగా యూవీ క్రియేషన్స్ సంస్థలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ చిత్రంలో డిసెంబర్ నెలాఖరు నుంచి జాయిన్ కానున్నాడు నవీన్. ఇందులో మరో ప్రధాన పాత్రలో అనుష్క శెట్టి నటిస్తున్నారు. ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలు నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార సంస్థ కలిసి నవీన్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో నుండి నవీన్ లుక్ రిలీజ్ చేశారు.  

 

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?