డెత్ వార్నింగ్: KGF యష్ కు పోలీస్ ప్రొటెక్షన్

Published : Mar 25, 2019, 07:37 PM ISTUpdated : Mar 25, 2019, 07:38 PM IST
డెత్ వార్నింగ్: KGF యష్ కు పోలీస్ ప్రొటెక్షన్

సారాంశం

KGF సినిమాతో కన్నడ బాక్స్ ఆఫీస్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో యష్ కు కన్నడ పోలీసులు ప్రత్యేక భద్రతను కల్పిస్తున్నారు. రీసెంట్ గా ప్రత్యక్ష రాజకీయాలపై స్పందించిన యాష్ కు బెదిరింపులు వస్తున్నాయి.  మరో కన్నడ హీరో దర్శన్ కి కూడా అదే తరహాలో బెదిరింపులు వచ్చాయి. 

అతని ఇంటిపై కూడా పలు దుండగులు రాళ్లతో దాడి చేశారు. రీసెంట్ గా యష్ - దర్శన్ మాండ్య లోక్ సభ అభ్యర్థురాలు సుమలతకు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అధికార పక్షం జేడీఎస్ కు పోటీగా హీరోలు సుమలతకు మద్దతు పలకడమే వివాదాలకు కారణమని తెలుస్తోంది.   

రాజకీయంగా కుమారస్వామి తన కొడుకు నిఖిల్ మాండ్యా ఎన్నికల్లో గెలవాలని యష్ పై కక్ష్య కట్టి ఈ విధంగా చేస్తున్నట్లు కామెంట్స్ వస్తున్నాయి. ఇక పోలీసులు ముందు జాగ్రత్తగా యష్ కు ప్రొటెక్షన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఇవ్వకపోవడంతో సుమలత స్వంతత్ర అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.     

PREV
click me!

Recommended Stories

The Raja Saab: భారీ రేట్‌కి రాజా సాబ్‌ ఓటీటీ డీల్‌, నిర్మాత బతికిపోయాడు.. ప్రభాస్‌ మూవీ టోటల్ లాస్‌ ఎంతంటే
Illu Illalu Pillalu Today Episode Jan 27: మళ్లీ విశ్వక్ మాయమాటలు నమ్మిన అమూల్య, పెళ్లి ఆగిపోతుందా?