Ennenno Janmala Bandham: వేద కోసం లవ్ బుక్ పంపిన విన్నీ.. కోపంతో రగిలిపోతున్న యష్?

Published : Feb 15, 2023, 10:40 AM IST
Ennenno Janmala Bandham: వేద కోసం లవ్ బుక్ పంపిన విన్నీ.. కోపంతో రగిలిపోతున్న యష్?

సారాంశం

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఫిబ్రవరి 15వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.  

ఈరోజు ఎపిసోడ్ లో వేద ఎమోషనల్ అవుతూ ఏంటి యశోదర్ గారు అంత మాట అనేసారు తనకు ప్రేమ పట్ల ఇంత ద్వేషం ఉందా. ఆయన మనసులో మళ్ళీ ప్రేమ చిగురించి అవకాశమే లేద. విన్నీ చెప్పినట్టు మా ఇద్దరికి సెకండ్ ఛాన్స్ సాంగ్స్ లేదా అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వేద అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా అప్పుడు యష్ నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నేను ఆఫీస్ కి వెళ్లడం లేదు అనడంతో సరే అని వేద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వేద హాస్పిటల్ కి వెళ్ళగా అక్కడ బొకే ఉండడం చూసి ఆశ్చర్య పోతుంది. అది యష్ పంపించాడు అనుకుని సంతోషపడుతూ వాటిని చూసి మురిసిపోతూ ఉంటుంది వేద.

మరోవైపు యష్ పేపర్ చదువుకుంటూ ఉండగా ఇంతలో వసంత్ అక్కడికి వచ్చి ఇదిగో యష్ ఫైల్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అనడంతో ఈరోజు వాలెంటైన్స్ డే నేను చిత్ర కలిసి ఎలా ఎంజాయ్ చేయడానికి వెళుతున్నాము అని అంటాడు. అంటే ఈరోజు ఒకటే ప్రేమించుకుంటారా నిన్న మొన్న ప్రేమించుకోరా అని వెటకారంగా మాట్లాడుతాడు. ఇప్పుడు వసంత్ అక్కడి నుంచి మెలికలు తిరుగుతూ సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వసంత్ అన్న మాటలు గుర్తుతెచ్చుకొని వేద సెకండ్ ఛాన్స్ గురించి అన్న మాటలు గురించి తలుచుకొని ఆలోచిస్తూ ఉంటాడు యష్.

అప్పుడు యష్ ఇందాక వేద నాకు వాలెంటెన్స్ డే గుర్తు చేయడం కోసం అలా మాట్లాడిందా అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు. ఆ తర్వాత యష్ బాల్కనీలోకి వెళ్లి వేద  గురించి ఆలోచించుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. తర్వాత యష్ వేద కి ఫోన్ చేస్తాడు. చెప్పండి అని వేద అనడంతో అప్పుడు యష్ సిగ్గుపడుతూ బయటికి వెళ్దామా అని అడుగుతాడు. ఎక్కడికి అని వేద సిగ్గుపడుతూ అడగడంతో సర్ప్రైజ్ అని అంటాడు. అప్పుడు వేద యష్ ఇద్దరూ సిగ్గుపడుతూ ఆనంద పడుతూ ఉంటారు. ఇప్పుడు టీవీలో సాంగ్ రావడంతో యష్ మరింత సంతోష పడుతూ ఉంటాడు. ఆ తరువాత మాలిని మెలికలు తిరుగుతూ డాన్స్ చేస్తూ పువ్వు చూసి మురిసిపోతూ ఉంటుంది.

ఏంటి మాలిని స్పెషల్ గా కనిపిస్తున్నావు అని రత్నం అడగడంతో స్పెషల్ డే అని చెప్పి రత్నం కి హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెప్పి పువ్వు ఇస్తుంది. అప్పుడు వారిద్దరూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వర్మ సులోచనకి రోస్ ఇచ్చి   హ్యాపీ వాలెంటైన్స్ డే అని విష్ చేయడంతో వాళ్ళిద్దరు కూడా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వేద కొరియర్ రావడంతో యష్ వెళ్ళి రిసివ్ చేసుకుంటాడు. అప్పుడు ఆ కొరియర్ విన్ని పంపించాడు అని తెలుసుకున్న యష్ దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు. అప్పుడు యష్ కొరియర్ ఓపెన్ చేయగా ఏంటిది నా పెళ్ళానికి వీడు రొమాంటిక్ నావల్ల పంపిస్తాడా అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు.

నేనేదో రొమాంటిక్గా వేదతో మాట్లాడితే నా మూడు మొత్తం చెడగొట్టాడు రాస్కెల్ అని కోపంతో తగిలిపోతూ ఉంటాడు. అప్పుడు యష్ వేదకు మళ్ళీ ఫోన్ చేస్తాడు.  చెప్పండి అనడంతో నీకోసం ఏదో కొరియర్ వచ్చింది అంటాడు. ప్రేమికుల రోజు నీకోసం ప్రేమగా మీ విన్నీ నవల పంపించాడు అనడంతో వేద సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు యష్ కుళ్ళుకుంటూ ఉండగా వేద సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు వేద విన్నీ గురించి గొప్పగా పొగడగా యష్ ఫోన్ కట్ చేస్తాడు. నేను బయటికి రావడం లేదు నాకు ఒక అర్జెంట్ పని ఉంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత విన్నీ అక్కడికి రావడంతో ఏంటి సర్ప్రైజ్ విన్నీ అనగా నా ఫ్రెండ్ వేద ని డాక్టర్ వేదగా చూడాలనిపించింది అందుకే వచ్చాను అంటాడు విన్నీ. 

అప్పుడు వారిద్దరూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వేద యష్ గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది. చాలా థాంక్స్ నాకోసం నాకు ఎంతో ఇష్టమైన లవ్ స్టోరీ బుక్ పంపించావు అనడంతో నీకు చేరిందా లేదా అని అంటాడు విన్నీ. ఇక పెళ్లయింది కదా మీ ప్రేమ విషయం ఏంటి అనడంతో మేము ఏమైనా చిన్న పిల్లలమా అని అంటుంది వేద. ప్రేమకు వయసు లేదు అంటాడు విన్నీ.

PREV
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్