
కన్నడ స్టార్ యష్..`కేజీఎఫ్` చిత్రాలతో ఇండియా వైడ్‌గా పాపులర్ అయిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. ఇప్పుడు `రామాయణ్`, `టాక్సిక్` చిత్రాలతో రాబోతున్నారు. రెండు భారీ సినిమాలతో ఇండియా వైడ్‌గా మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు యష్.
ఈ క్రమంలో తాజాగా యష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్, శాండల్‌వుడ్, మాలీవుడ్, కోలీవుడ్ అనే పదాలపై ఆయన హాట్ కామెంట్ చేశారు. ఈ పేర్లంటే తనకు నమ్మకం లేదన్నారు. తన టార్గెట్ ఏంటో స్పష్టం చేశారు. ఆయన ఏం చెప్పారంటే..
'కెజిఎఫ్ పార్ట్-1' సూపర్ హిట్ అయిన సమయంలో యష్ ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది. ఇందులో యష్‌ని యాంకర్ 'మీకు బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయా?' అని అడిగారు.
దానికి యష్ 'నాకు బాలీవుడ్, శాండల్‌వుడ్, టాలీవుడ్ అనే కాన్సెప్ట్స్‌లో నమ్మకం లేదు. ముంబైలో సినిమా తీస్తే బాలీవుడ్, ఆంధ్రలో తీస్తే టాలీవుడ్, కర్ణాటకలో తీస్తే శాండల్ వుడ్ అంటున్నారు.
నా దృష్టిలో ఏ సినిమా అయినా ఇండియన్ సినిమానే. నేను పాన్ ఇండియా సినిమాల్లో నటించడానికి కారణం ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకోవడం కోసం మాత్రమే` అని తెలిపారు యష్.
యష్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. బాలీవుడ్ 'రామాయణ' సినిమాలో రావణుడిగా నటిస్తున్నారు. ఇందులో రావణుడిగా కనిపించబోతున్నారు యష్. అలాగే మరో పాన్ ఇండియామూవీ 'టాక్సిక్' లో కూడా నటిస్తున్నారు.
యష్ తన భార్య రాధిక పండిత్ గురించి చెబుతూ, 'రాధిక నా బలం. ఆమె ఎప్పుడూ నన్ను సపోర్ట్ చేస్తుంది. మేమిద్దరం కలిసి పెరిగాం. నేను ఆమెని మొదట స్నేహితురాలిగా చూశాను. తర్వాత ప్రేమికురాలిగా, భార్యగా మారింది.
ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి. ఆమె నా స్నేహితురాలు కాబట్టి నాకు ఏది ఇష్టమో తెలుసు. నాకు కూడా ఆమెకు ఏది ఇష్టమో తెలుసు. నేను ఏ సినిమా చేసినా, దాని వల్ల ఎంత డబ్బు వచ్చిందని ఆమె ఎప్పుడూ అడగలేదు. ఆ సినిమా మంచిదా, చెడ్డదా అని కూడా అడగలేదు.
ఆమె అడిగేది ఒక్కటే, 'నువ్వు సంతోషంగా ఉన్నావా?' అని మాత్రమే' అని చెప్పారు. యష్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ 'కొత్తలవాడి' సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 1, 2025న విడుదల కానుంది.