ప్రభాస్ మంచి మనసు.. అభిమాని చివరి కోరికి తీర్చిన యంగ్ రెబల్ స్టార్..

Published : May 28, 2023, 01:00 PM IST
ప్రభాస్ మంచి మనసు.. అభిమాని చివరి కోరికి తీర్చిన యంగ్ రెబల్ స్టార్..

సారాంశం

తమకు ఇంత స్టార్స్ ను చేసిన అభిమానులకు ఎప్పుడూ రుణపడే ఉంటారు స్టార్ హీరోలు. వారికి ఏమైనా కష్టం వస్తే.. వెంటనే కదిలి వస్తారు. మరీ ముఖ్యంగా  మన తెలుగు హీరోలు ఫ్యాన్స్ అంగే ప్రాణం ఇస్తుంటారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. మంచి మనసు చాటుకున్నారు.   

ప్రభాస్.. నిజంగా హీరో అనిపించకుంటున్నాడు. ఆరడుగుల అందగాడే కాదు.. మంచి మనసున్న రాముడు ప్రభాస్ అనిపించుంటున్నాడు.  షూటింగ్ ఉంటే సెట్ లో ఉన్నవారికి బోజనం . సాయం కోరిక వాళ్లను లేదనకుండా చేస్తారన్న పేరుంది. అంతేకాదూ అతిధి మర్యాదలు చేయడంలో.. ప్రభాస్ తరువాతే ఎవరైనా.  అంతే కాదు అభిమానులను ఆదరించడంలో కూడా వారి తరువాతే ఎవరైనా. అంతే కాదు  స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉంటాయి కాని.. ప్రభాస్ కాని.. ఆయన ఫ్యాన్స్ కాని ఏ హీరో ఫ్యాన్స్ తో గోడవలు ఉండవు..  అందుకే ఒక్కో హీరోకి అభిమానులున్నప్పటికీ.. ప్రభాస్‌ను అందరి హీరోల అభిమానులు ఇష్టపడుతుంటారు. అభిమానులకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాడు ప్రభాస్. అందుకే ఆయన్ను డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. 


చేసిన మంచి చెప్పుకునే అలవాటు లేదు ప్రభాస్ కు. పబ్లిసిటీకి దూరంగా ఉంటాడు స్టార్ హీరో. తాజాగా డార్లింగ్ ప్రభాస్ ఒకప్పుడు చేసిన ఓ మంచి పని రీసెంట్ గా వైరల్ అవుతుంది.  ఇది చూసిన చాలా మంది  ప్రభాస్ ను దేవుడు అంటున్నారు. ఇంతకీ ప్రభాస్ ఏం చేశాడంటే..? కన్నయ్య అలియాస్ రంజిత్ ప్రభాస్ కు వీరాభి మాని.  కాని ఆయన  ప్రస్తుతం  ఈ లోకంలో లేడు. ఓ రేర్ క్యాన్సర్ తో.. అతను ఇబ్బంది పడ్డాడు. మందులు లేని కాన్సర్ రావడంతో.. చనిపోక తప్పదు అని అతనికి అర్ధం అయ్యింది. దాంతో అతను తన చివరి రోజుల్ల కొన్ని కొరికలు మిగిలిపోవడంతో.. తల్లీ తండ్రి వాటిని తీర్చాలని డిసైడ్ అయ్యారు.  ఇష్టమైన ప్రాంతాలకు తీసుకెళ్లడం, ఇష్టమైన పనులు చేయడం, ఫుడ్ వండి పెట్టడం చేశారు. 

అతను  ప్రభాస్ కి వీరాభిమాని కావడం.. ప్రభాస్ ను కలవాలి అనే కోరిక మిగిలిపోవడంతో..  కుమారుడు చివరి కోరిక తీర్చేందుకు అతని తల్లి.. డైరెక్టర్  పూరి జగన్నాథ్ భార్య లావణ్యకు ఫోన్ చేసి విజయం చెప్పారట. ప్రభాస్‌కు ఈ విషయాన్ని చేర్చారు లావణ్య. వెంటనే అతడిని కలిసేందుకు ఒప్పుకున్నారట ప్రభాస్. అంతేకాకుండా అతడికి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసుకున్న ఫ్రభాస్.. అతడి కోరికను ఏంటని అడిగారట. బాహుబలి సినిమాలో వినియోగించిన ఏదైనా వస్తువు ఇవ్వాలని కన్నయ్య చెప్పడంతో.. అన్ని ఏర్పాట్లు చేశారట. కన్నయ్య, అతని తల్లిని కలిసిన ప్రభాస్.. కన్నయ్యకు ఇష్టమైన చికెన్ మంచూరియా తెప్పించి ఇచ్చారట. అలాగే బహుబలి సినిమాలో వినియోగించిన కత్తిని బహుమతిగా ఇచ్చారు.

ప్రభాస్ ను చూడంటో ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేవు. తన కుఇష్టమైన హీరో.. ఇష్టమైన వస్తువు తీసుకుని రావడం.. తనతో  సుమారు  అరగంట పాటు టైమ్ స్పెండ్ చేయడంతో.. అతని ఆనందం చూసి వారి.. తల్లి.. ఉబ్బితబ్బిబ్బు అయ్యింది. అనంతరం ప్రభాస్ కు ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయారట. ఇదంతా  లాస్ట్ ఇయర్ జరిగినట్టు తతెలుస్తోంది.  తన తనయుడు చనిపోయినా కూడా అతని విగ్రహం తయారు చేయించి  ఇంట్లోనే పెట్టుకుంది ఆ తల్లి.  ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

100 సినిమాల్లో 44 ప్లాప్ లు, 30 మూవీస్ రిలీజ్ అవ్వలేదు, అయినా సరే ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?