'యానిమల్' బ్యాటీ తృప్తి డిమ్రి ని బోయ్ కాట్ చేయాలని,సినిమాలు చూడద్దని పిలుపు

By Surya Prakash  |  First Published Oct 2, 2024, 8:06 AM IST

మా టైమ్, డబ్బు వేస్ట్ చేసిందని ఆమెను బోయ్ కాట్ చేయాలని పిలుపు ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ వీడియో షేర్ చేస్తే అది వైరల్ అయ్యింది. 



ఒక్కోసారి చిన్న చిన్న వివాదాలు ఓవర్ నైట్ లో పెద్దవై పోతాయి. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో అది మరీ ఎక్కువ. చిన్న మిస్ అండర్ స్టాండింగ్ తృప్తి దిమ్రిని వివాదంలో పడేసింది. 
రణ్ బీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమాతో  ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన తృప్తి దిమ్రి దేశమంతటా పాపులర్ అయ్యింది . ఈ సినిమాలో రష్మిక మందన్నా మెయిన్ హీరోయిన్ అయినా తృప్తికే ఎక్కువ మార్కులు పడటం కలిసొచ్చింది. అమె అందానికి కుర్రకారు పిచ్చెక్కిపోయారు.   గ్లామర్‌తో పాటు యాక్టింగ్‍‍తోనూ ఆకట్టుకున్న ఆమె  సరికొత్త నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. మొత్తంగా తృప్తి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు.  ఈ క్రమంలో ఆమె వరస సినిమాలతో పాటు కొన్ని పోగ్రామ్ లకు గెస్ట్ గానూ వెళ్లటానికి కమిటైంది. 

 తృప్తి డిమ్రి పై మహిళా పారిశ్రామిక వేత్తల మండిపాటు

అయితే అదే సమయంలో ఆమె టీమ్ చేసిన పొరపాటుతో జైపూర్ లోని మహిళా పారిశ్రామక వేత్తల ఆగ్రహానికి గురింది. వాళ్లంతా ఆమె సినిమాలు జైపూర్ లో రిలీజ్ చేయటానికి వీల్లేదని, ఆమెను బాయ్ కాట్ చేయాలని పిలుపు ఇచ్చారు. ఆ మేరకు ఓ వీడియోని వాళ్లు రిలీజ్ చేస్తే అది అంతటా వైరల్ అయ్యింది. ఇప్పుడు ఆమె సినిమాలపై ఆ ఇంపాక్ట్ పడుతుందని భయపడుతున్నారు నిర్మాతలు. అయితే అసలు ఏం జరిగింది. 

Latest Videos

తృప్తి దిమ్రి కెరీర్ ఓవర్ నైట్ లో మారిపోయింది.   'యానిమల్'కి ముందు, 'యానిమల్' తర్వాత అన్న స్దాయిలో ఆమెకు పాపులారిటీ వచ్చింది. ఆ సినిమా రిలీజ్ తర్వాత జనాలు అందరూ ఆమెను సెకండ్ బాబీ అని పిలుస్తున్నారు. రణబీర్ కపూర్, తృప్తి దిమ్రి యాక్ట్ చేసిన బెడ్ సీన్ వైరల్ అయ్యింది. దాంతో ఆవిడను ఫాలో అవుతున్న ఆడియన్స్ పెరిగారు. ఈ క్రమంలో జైపూర్ కు చెందిన కొందరు మహిళా  పారిశ్రామిక వేత్తలు ఆమెను మంగళవారం జరిగిన  FICCI FLO ఈవెంట్ కు గెస్ట్ గా పిల్చారు. అందుకోసం ఆమెకు ఐదున్నర లక్షలు కు డీల్ కుదుర్చుకున్నారు. అందులో భాగంగా ఆమెకు అడ్వాన్స్ గా సగం ఎమౌంట్ పే చేసారు. అయితే ఆమె లాస్ట్ మినిట్ లో  ఈవెంట్ ని స్కిప్ చేసింది. దాంతో వాళ్లు మండిపడుతున్నారు.

 తృప్తి డిమ్రి వైరల్ వీడియో

మహిళా పారిశ్రామిక వేత్తలు కు ఈ విషయంలో చాలా ఆగ్రహం వచ్చింది. రానంటే మొదటే చెప్తే వేరే వాళ్లను చూసుకుందుము కదా.ఇలా చేస్తుందా, మా టైమ్, డబ్బు వేస్ట్ చేసిందని ఆమెను బోయ్ కాట్ చేయాలని పిలుపు ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ వీడియో షేర్ చేస్తే అది వైరల్ అయ్యింది. ఈ విషయంలో తృప్తికి కొందరు సపోర్ట్ చేస్తున్నారు. ఆమె ఏ కారణంతో ఈవెంట్ కాన్సిల్ చేసుకుంది అనేది తెలుసుకుని అప్పుడు చేయాలంటున్నారు. మరికొందరు ఓవర్ నైట్ లో స్టార్ అయితే ఇలాగే ఏడిట్యూడ్ ఉంటుందని తిట్టిపోస్తున్నారు. 

 తృప్తి డిమ్రి ప్లైట్ మిస్సవటమే సమస్యకు కారణం?


అయితే ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయమై బాలీవుడ్ మీడియా తమ కథనాలలో ..తృప్తి డబ్బులు తీసుకోలేదు. కానీ ఆమె తరుపున ఆర్గనైజర్స్ తీసుకున్నారు. సాధారణంగా ఆర్గనైజర్స్ ఓ టీమ్ ని హైర్ చేస్తారు. వాళ్లే మొత్తం ఈ విషయాలు చూస్తారు. సెలబ్రెటీ రావటం, సెక్యూరిటీ,షెడ్యూల్, ఈవెంట్ లో ఆమెకు ఇబ్బంది లేకుండా చూడటం, వంటి విషయాలు అన్ని చూస్తారు. అప్పటికీ తృప్తి షెడ్యూల్ ప్రకారం  జైపూర్ బయిలుదేరింది. కానీ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ప్లైట్ ని క్యాచ్ చేయలేక పోయింది. దాంతో ఈవెంట్ మిస్సైంది. ఆ విషయం ఆర్గనైజర్స్ చెప్పి  ఒప్పించాలి. కానీ వాళ్ళకు కూడా అంత టైమ్ ఉండి ఉండదు అంటూ చెప్పుకొచ్చారు. 

 
 ఆషికీ 3 లో  తృప్తి డిమ్రి 

 కార్తీక్ ఆర్యన్‍తో  తృప్తి డిమ్రి  నటిస్తే అద్భుతంగా ఉంటుందని ఆషికీ 3 మేకర్స్ కొంతకాలంగా అనుకుంటున్నారట. అయితే, ఈ విషయంపై కొన్ని రోజుల చర్చ తర్వాత ఎట్టకేలకు హీరోయిన్‍గా తృప్తి డిమ్రిని ఫిక్స్ చేసినట్టు ఆ మూవీ వర్గాల నుంచి సమాచారం.దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆషికీ 3 చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహించనున్నారు. టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కూడా మ్యూజికల్ లవ్ స్టోరీగానే రూపొందనుంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన మ్యూజిక్ స్కోర్ క్రియేట్ చేస్తామని ఇటీవల అనురాగ్ బసు తెలిపారు.ఆషికీ 3 సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. త్వరలోనే ఇతర నటీనటులు, టెక్నిషియన్ల గురించి మేకర్స్ ప్రకటించనున్నారు. 

 విజయ్ దేవరకొండ సరసన తృప్తి డిమ్రి ?

ఇదిలా ఉంటే తృప్తి డిమ్రి  రెమ్యునరేషన్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఆమె తాజాగా “భూల్ భులయ్య 3” సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తోంది. ఆమె “యానిమల్” చిత్రంలో నటించినందుకు 40 లక్షల రూపాయలు అందుకొంది. కానీ “భూల్ భులయ్య 3″కి ఆమె ఏకంగా దాదాపు కోటి రూపాయలు తీసుకుంటోంది అని టాక్. అంటే తృప్తి పారితోషికం ఒక్క సినిమా సక్సెస్ తో రెండింతలు అయింది. ఇకపై బాలీవుడ్ లో చేసే అన్ని సినిమాలకు ఎక్కువ పారితోషికం డిమాండ్ చెయ్యనుంది. ఇంకో రెండు హిట్స్ పడితే ఈ భామ రెండు కోట్లకు పైగా అందుకోవడం ఖాయం అంటున్నారు బాలీవుడ్ మీడియా జనం.  మరోవైపు ఈ భామని తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటింప చెయ్యాలని ఓ నిర్మాత భావిస్తున్నారు.

click me!