మ్యాడ్‌నెస్‌ పీక్‌, `బహిర్బూమి` పేరుతో సినిమా, ఏం చూపించారో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!

By Aithagoni Raju  |  First Published Oct 2, 2024, 12:39 AM IST

బహిర్బూమి అనే పదం వింటేనే షాకింగ్‌గా ఉంది. అలాంటిది అదే పేరుతో సినిమా చేశారు. అసలైన కంటెంట్‌ని ఇందులో చూపించబోతున్నారట. 
 


రా కంటెంట్‌ని బాగా చూస్తున్నారు ఇప్పుడు ఆడియెన్స్. రా అండ్ రస్టిక్‌ కంటెంట్‌ బాగా సేలబుల్‌గా ఉంటుంది. తెలుగు ఆడియెన్స్ ఎక్కువగా ఇలాంటి కథలను కోరుకుంటున్నారు. అందుకే మాస్‌, యాక్షన్‌, రా కంటెంట్‌తో వచ్చిన చిత్రాలు బాగా ఆదరణ పొందుతున్నాయి. పెద్ద హిట్‌ అవుతున్నాయి. మట్టివాసనలు ప్రతిబింబించే సినిమాలను జనం బ్రహ్మారథం పడుతున్నారు.

అయితే ఇప్పుడు ఆ సహజత్వంలో పీక్‌, మ్యాడ్‌నెస్‌, పిచ్చిని చూపించబోతున్నారు. `బహిర్భూమి` పేరుతోనే సినిమాని తీశారు. అది ఈ నెల 4న విడుదల కాబోతుంది. ఈ మూవీకి రాంప్రసాద్‌ కొండూరు దర్శకత్వం వహించారు. నోయల్‌ హీరోగా నటించడం విశేషం. ఆయనకు జోడీగా రిషిత నెల్లూరు నటించింది. మహకాళి ప్రొడక్షన్స్ పతాకంపై మచ్చ వేణు మధవ్‌ నిర్మించారు. 

Latest Videos

బోల్డ్ కంటెంట్‌ తో `బహిర్భూమి` మూవీ..

సినిమా రిలీజ్‌ కాబోతున్న నేపథ్యంలో దీని గురించి ఆసక్తికర విషయాలను బయటకు వచ్చాయి. టైటిల్‌ ఇలా పెట్టడం ఆశ్చర్యపరుస్తుంది. చాలా డీ గ్రేడ్‌ చేసే అర్థంలో ఈ పేరుని వాడతాడు. గ్రామాల్లో ఈ పదం బాగా వాడుకలో ఉంటుంది. ఒకప్పుడు బాగా ఉపయోగించే వాళ్లు, వాడుకలో ఉన్న పదం కూడా. కానీ ఇప్పుడు ఇంగ్లీష్‌ పదాల జోరులో దాన్ని మర్చిపోతున్నారు. ఈ క్రమంలో ఇదే పదంతో ఇప్పుడు సినిమా రావడం ఆశ్చర్యంగా మారింది.

మరి ఇందులో ఏం చూపించారు, ఎలా ఉండబోతుంది అనే విషయాలు తెలుసుకుందాం. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజయ్‌ పట్నాయక్‌ ఆ విశేషాలను పంచుకున్నాడు. ఆయన పాపులర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆర్పీ పట్నాయక్‌ కి కజిన్‌ కావడం విశేషం. ఆయన ప్రోత్సాహంతో ఈ రంగంలోకి వచ్చారు. 

ఆర్పీ పట్నాయక్‌ కజిన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌

విజయనగరంలో పుట్టిన అజయ్‌ పట్నాయక్‌లది మ్యూజికల్‌ ఫ్యామిలీ. రోషణ్‌ బ్యాండ్‌ పేరుతో శుభకార్యాల్లో సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండేవాళ్లు. వీరి బ్రాండ్‌ పేరుని పెళ్లి కార్డులపై కూడా కొట్టించేవాళ్లట. దానికోసమే పెళ్లిళ్లకి వచ్చేవాళ్లంటే అతిశయోక్తి కాదు. తాను కీ బోర్డ్ ప్లేయర్‌గా కెరీర్‌ని ప్రారంభించారు. స్టడీస్‌ కోసం హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఆర్పీ పట్నాయక్‌ వద్ద అసిస్టెంట్‌గా చేశాడు. ఆ తర్వాత మణిశర్మ వద్ద కూడా కొన్ని రోజులు పనిచేశాడు. పది, పదిహేనేళ్ల క్రితమే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ని ప్రారంభించాడు.

ఇప్పటి వరకు 12 సినిమాలు చేసినా పేరు రాలేదు. `బహిర్బూమి`లోనే పాటకి విశేష స్పందన లభించిందట. మంచి ఆదరణ లభిస్తుందని, అవకాశాలు కూడా వస్తున్నాయని, ఈ చిత్రంలోని పాట బయటకు రావడంతో ఐదారు సినిమా ఆఫర్లు వచ్చాయని తెలిపారు. ఇందులోని మ్యూజిక్‌ `మంగళవారం` సినిమా రేంజ్‌లో ఉంటాయని, రిలీజ్‌ తర్వాత తన రేంజ్‌ మారిపోతుందన్నారు. 

`బహిర్భూమి`లో నోయల్‌ నటుడిగా, సింగర్‌గా..

``బహిర్భూమి` సినిమాలో హీరో నోయెల్ కు నత్తి ఉంటుంది. నత్తితోనే ఒక పాట కంపోజ్ చేశాం. ఇలాంటి ప్రయత్నం ఇప్పటిదాకా ఏ భాషలోని పాటకూ చేయలేదు. నోయెల్ మంచి నటుడే కాదు మంచి సింగర్ కూడా. తను ర్యాప్ పాడాడు. నేను కంపోజ్ చేసిన ప్రతి సాంగ్ ను డైరెక్టర్ తో పాటు నోయెల్ కు కూడా వినిపించేవాడిని. వాళ్లకు సాంగ్స్ బాగా నచ్చాయి. సినిమాను ఒక ఆడియెన్ గా చూసి చెబుతున్నా.  చాలా బాగుంటుంది. ఒక కొత్త తరహా కంటెంట్ ను మెసేజ్, ఎంటర్ టైన్ మెంట్ రెండూ కలిపి రూపొందించారు దర్శకుడు రాంప్రసాద్. అన్ని అంశాలు మేళవింపుగా ఉంటుంది. ఓ కొత్త జోనర్‌లో ఉంటుంది.

ఏఆర్‌ రెహ్మాన్‌ స్పూర్తితో..

 సంగీత దర్శకుడిగా నాకు ఏఆర్ రెహమాన్ అంటే చాలా ఇష్టం. ఆయన రోజా సినిమా రిలీజ్ టైమ్ కు నాకు 8 ఏళ్లు. రోజా పాటలన్నీ పాడేవాడిని. ఆయనను ఒకసారి కలిసే అవకాశం వచ్చింది. సింగర్ కృష్ణ పాటలను ఇష్టపడతా. సంగీత దర్శకుడిగా మా అన్నయ్య సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆయన ప్రభావం నా మీద పడకుండా జాగ్రత్తగా ట్యూన్స్ చేస్తుంటా.

గతంలో ఓ సినిమాలో పాటకు ఆర్పీ గారే తమ్ముడికి సాంగ్ చేసి ఇచ్చారేమో అని కామెంట్ చేశారు. అయితే మనకు ఇష్టమైన పాటలన్నీ వింటూ పెరిగిన క్రమంలో మనకు తెలియకుండానే ఆ స్ఫూర్తి కలుగుతుందేమో తెలియదు. కానీ నాకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకునేలా మ్యూజిక్ చేయాలనేది నా కోరిక` అని వెల్లడించారు సంగీత దర్శకుడు. 

బహిర్భూమి ఆల్‌ మిక్స్.. 

అయితే `బహిర్భూమి` సినిమా విషయానికి వస్తే ఇది అన్ని జోనర్‌ మేళవింపుగా ఉంటుందట. కామెడీ, థ్రిల్లర్‌, యాక్షన్‌, సస్పెన్స్ అంశాలు ఉంటాయట. బహిర్బూమికి వెళ్లినప్పుడు జరిగే సంఘటనే ప్రధానంగా ఉంటాయట. మరి అక్కడ ఏం జరిగిందనేది ఆసక్తికరం. ఇలాంటి టైటిల్‌తో సినిమా చేయడం పెద్ద సాహసం. కొంత బోల్డ్ కంటెంట్‌ని కూడా చూపించబోతున్నారట. అదే ఇందులో హైలైట్‌ అని తెలుస్తుంది. మరి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 
 

click me!