లైగర్ తో నష్టాలు కాదు పూరి-ఛార్మికి కోట్లలో లాభాలు... విజయ్ దేవరకొండకు మాత్రం బ్యాండ్!

By Sambi ReddyFirst Published Sep 10, 2022, 10:02 AM IST
Highlights

లైగర్ మూవీతో పూరి-ఛార్మి మొత్తంగా మునిగిపోయారన్న ప్రచారం జరుగుతుంది. అయితే అందుకు విరుద్ధంగా ఈ దర్శక నిర్మాతలు కోట్లలో ఆర్జించినట్లు అసలు లెక్కలు చూస్తే అర్థం అవుతుంది.


లైగర్ సినిమా బడ్జెట్, బిజినెస్, వచ్చిన నష్టాలు అన్నీ అంచనా వేస్తే దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి నష్టపోయింది ఏమీ లేదంటున్నారు. పైగా ఆ సినిమా ద్వారా కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు కొందరు అంచనా వేస్తున్నారు. లైగర్ చిత్రాన్ని రూ. 60 - 70 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించారు. అన్ని భాషల్లో కలిపి లైగర్ రూ. 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే రూ. 20 నుండి 30 కోట్ల లాభానికి లైగర్ హక్కులు విక్రయించారు. 

ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా మరి కొంత రాబట్టారు. మొత్తంగా లైగర్ మూవీ నిర్మాత ఛార్మి, పూరిలకు ఎలాంటి నష్టాలు కలిగించలేదు. ఇక్కడ మొత్తంగా నష్టపోయింది డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు మాత్రమే. లైగర్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న కరణ్ జోహార్ సైతం బయటపడ్డారట. అయితే హీరో విజయ్ దేవరకొండ కూడా నష్టపోయినట్లు తెలుస్తుంది. 

లైగర్ మూవీ విజయంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ లో కేవలం 25% మాత్రమే తీసుకున్నారట. లైగర్ చిత్రానికి విజయ్ దేవరకొండ రూ. 25 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. ఇందులో ఇంకా మూడు వంతులు చెల్లించాల్సి ఉందట. ఇంకా విజయ్ దేవరకొండకు పూరి, ఛార్మి రెమ్యూనరేషన్ సెటిల్ చేయలేదట. లైగర్ కారణంగా నష్టపోయింది హీరో విజయ్ నే అంటున్నారు. 

మరోవైపు జనగణమన ఆగిపోవడం కూడా ఆయన కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పాన్ ఇండియా మోజులో స్టోరీ గురించి పట్టించుకోకుండా లైగర్ మూవీ చేశాడు విజయ్ దేవరకొండ. సినిమాను అన్ని విధాలుగా అమ్ముకున్న పూరి-ఛార్మి సేఫ్... మధ్యలో నష్టపోయింది బయ్యర్లు, హీరో విజయ్ దేవరకొండ. 

click me!