'భోళా శంకర్' కి ' జైలర్' దెబ్బ కొడుతున్నాడా?

Published : Aug 06, 2023, 11:26 AM IST
 'భోళా శంకర్' కి ' జైలర్' దెబ్బ కొడుతున్నాడా?

సారాంశం

. ఆగస్ట్ 10న జైలర్, 11న భోళా శంకర్ సినిమాలు రాబోతున్నాయి. అంటే రిలీజ్‌కి ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది అయినా ఎక్కడా ఈ సినిమాల మీద అనుకున్న స్దాయిలో హైప్ కాని, బజ్ కానీ కనిపించట్లేదు.


ఒకరు మెగాస్టార్, మరొకరు సూపర్ స్టార్ ..వీళ్లిద్దరి సినిమాలు ఒకే సారి భాక్సాఫీస్ దగ్గర రిలీజ్. ఖచ్చితంగా ఎవరి సినిమా గెలుస్తుంది. ఎవరిది ప్రక్కన నిలబడుతుందనే చర్చ సహజంగా మొదలు అవుతుంది. ఇప్పుడు అలాంటి చర్చే జైలర్ కు, భోళా శంకర్ కు మధ్య మొదలైంది. ఈ రెండు చిత్రాల్లో ఏది పై చేయి అనేదాని కన్నా ఎవరి వల్ల ఎవరు లాభపడతారు అనేది హాట్ టాపిక్ గా మారింది. 
 
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ప్రారంభంలో `వాల్తేరు వీర‌య్య‌` సినిమాతో వింటేజ్ లుక్‌తో అద‌ర‌గొట్టిన మెగాస్టార్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వ‌ద్ద రూ.200 కోట్లు కొల్ల‌గొట్టారు. `ఆచార్య‌` ఫ్లాప్ త‌రువాత `వాల్తేరు వీర‌య్య‌`తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేసిన చిరంజీవి స‌రికొత్త ఉత్సాహంతో ఈ యాక్ష‌న్ డ్రామా   `భోళా శంక‌ర్‌` తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఏకె ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్ అనిల్ సుంక‌ర నిర్మిస్తున్నారు. త‌మిళంలో అజిత్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `వేదాలం` ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేశారు. సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా సాగే ఈ మూవీలో చిరుకు జోడీగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా న‌టిస్తుండ‌గా, సిస్ట‌ర్‌గా కీల‌క పాత్ర‌లో క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ న‌టిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేయా అంటే అంతగా లేవనే చెప్పాలి.

మెగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ లో తప్పితే మిగతా ఆడియన్స్ లో పెద్దగా ఎక్సపెక్టేషన్స్ లేవు. దానికి తోడు రీమేక్ సినిమా  కావటం, ట్రైలర్ చూస్తే..రెగ్యులర్ కమర్షియల్ సినిమా అనిపించటం,    శక్తి, షాడో లాంటి డిజాస్టర్ సినిమాలు చేసిన మెహర్ రమేష్ డైరక్టర్ కావడంతో సినిమాకు పెద్దగా అంచనాలు అయితే లేవు. అయితే అంచనాలు లేకపోవటం కూడా ఓ అంచనానే. ఆ అంచనా చాలా సార్లు తిరగబడి...ఏ మాత్రం బాగున్నా సినిమా ఎక్కడికో వెళ్లిపోతుంది.  ప‌క్కా తెలంగాణ యాస‌లో చిరు తొలిసారి డైలాగ్‌లు చెప్ప‌నున్న ఈ మూవీ తో మ‌రో సారి చిరు పూన‌కాలు లోడింగ్ లాంటి పెర్ఫార్మెన్స్‌తో అద‌ర‌గొడితే చెప్పలేం.   `భోళా శంక‌ర్` ఆగ‌స్టు 11న భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

అయితే రజనీకాంత్  జైలర్ కాస్త రొటీన్ కు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఈ సినిమాలో త్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని ట్రైలర్ ని బట్టి అర్దమవుతోంది.అయితే రజనీ సినిమాలు ఈ మద్యకాలంలో భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కావటంలేదు. ఈ దర్శకుడు గత చిత్రం భీస్ట్..రిలీజ్ కు ముందు పెద్ద సెన్సేషన్ ..రిలీజ్ అయ్యాక డిజాస్టర్. కాబట్టి ఈ సినిమా ట్రైలర్ లో ఉన్నట్లు ఇంటెన్స్ తో థ్రిల్లింగ్ గా ఉంటే పెద్ద హిట్టే..ఖచ్చితంగా భోళా శంకర్ పై ప్రభావం పడుతుంది. కాకపోతే జైలర్ జనం అంతా భోళా శంకర్ థియేటర్ లో ప్రత్యక్ష్యమవుతారు.  మరి జైలర్ తో రజనీకాంత్ ఇంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి. నెల్సన్ దిలీప్ కూడా ఈ సినిమాకు దర్శకత్వం వహించగా సన్ పిక్చర్స్ నిర్మించింది.
 

PREV
click me!

Recommended Stories

Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం
సుమ కు బాలకృష్ణ భారీ షాక్, అఖండ 2 దెబ్బకు 14 సినిమాలు గల్లంతు..?