సింగర్ సునీత కుమారుడు హీరోగా చిత్రం, టీజర్ చూసారా? నిరోధ్ చుట్టూ

Published : Aug 06, 2023, 10:38 AM IST
సింగర్ సునీత కుమారుడు హీరోగా చిత్రం, టీజర్ చూసారా? నిరోధ్ చుట్టూ

సారాంశం

సింగర్ సునీతకు హీరో అంత ఎదిగిన కుమారుడు ఉన్నట్లుగా తెలియటం, దాంతో  తాజా టీజర్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.


 సీనియర్ గాయనిగా వెలుగుతున్న  సునీత కుమారుడు ఆకాష్ హీరోగా అరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. లెజెండ్రీ ఫిల్మ్ మేకర్ కె. రాఘవేంద్రరావు ప్రస్తుతం తన ఆర్కె టెలిఫిలిమ్ షో బ్యానర్ పై సర్కారు నౌకరి అనే టైటిల్ తో ఈ  సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి శేఖర్ గంగ మౌని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సునీత కుమారుడు హీరోగా పరిచయమవుతున్నట్లుగా సమాచారం. గత కొన్ని రోజులుగా ఈ మూవీ  షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ మధ్యనే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ట్రైజర్ రిలీజ్ చేసారు. 

1996 లో కొల్లాపూర్ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఆరోజుల్లో ప్రభుత్వ ఉద్యోగి అంటే ఎంత విలువ ఉండేదో కూడా ఈసినిమా ద్వారా చూపించారు. అలాగే టీజర్ చివర్లో నిరోధో గురించి డైలాగు చెప్పటంతో ఈ సినిమాపై మంరిత  ఆసక్తి కలిగింది. ఇక ఈసినిమాలో న్యాచురల్ గా ఉన్న విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటున్నాయి. చూడబోతే ఆకాష్ ఈసినిమాతో మంచి హిట్ నే కొట్టేలా కనిపిస్తున్నాడు.థియేటర్ ఆర్టిస్ట్ భావన దీనిలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆమె పార్టిసిపేషన్ ప్రాజెక్టు పై ఆసక్తిని పెంచింది. 

  ఈ సినిమాను లెజెండరీ డైరెక్టర్ కే.రాఘవేంద్రరావు ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆకాశ్‌కు జోడీగా భావనా వళపండల్ నటిస్తోంది. ఇంకా ఈసినిమాలో తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ ఇతర పాత్రల్లో కనిపించనుననారు. శాండిల్య సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కూడా గంగనమోని శేఖర్ పనిచేస్తుండటం విశేషం.

సీనియర్ సింగర్  సునీత వందలాది పాటలతో చిత్ర పరిశ్రమలో తనదైన మార్క్ వేసారు. ఆమె ఖాతాలో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. ఎన్నో పాపులర్ సింగింగ్ రియాలిటీ షోలకు జడ్జిగా కూడా ఆమె పనిచేశారు. సింగర్ సునీతకు హీరో అంత ఎదిగిన కుమారుడు ఉన్నట్లుగా తాజా టీజర్ తో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం
సుమ కు బాలకృష్ణ భారీ షాక్, అఖండ 2 దెబ్బకు 14 సినిమాలు గల్లంతు..?